ఆశ సి హెచ్ డబ్ల్యు ల సమస్య పరిష్కారం చేయాలని సీఐటీయు ఆధ్వర్యంలో మాడగడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో ధర్నా నిర్వహించారు. సీఐటీయు మండల కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ఆశకార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పది వేల జీతం సక్రమంగా అందడం లేదని ఆరువేల ఐదు రూపాయలు మాత్రమె అందుతుందని పెంచిన10 వేలు జీతం ప్రతినెల ఒకేసారి ఇవ్వాలని కోవిడ్19 ఇన్సూరెన్స్ యాబై లక్షలు వర్తిoపచేయలని రిటర్మెంట్ చేయాలని లక్ష ఎక్సగ్రేషియ వేతనం సగం పెన్షన్ వారి కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆశ కార్యకర్త ఏ కారణం లోనైన ఉద్యోగం నుండి తోలగిపోతే ఎం హెచ్ ఎం నిధుల నుండి 20 వేలు చెలించాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా చెలించలేదు అని అర్హులైన ఆశలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలని నవంబర్26 న .జరిగేదేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక హక్కులు చట్టాలు కాపాడేందుకు ప్పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ సంఘం నాయకులు లక్ష్మీ రాధ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు