నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు, సారాయి అంగడి సెంటర్లో ఉన్న 35వ వార్డు సచివాలయం ని కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ పార్థసారథి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆయన వివిధ రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది నిర్దేశించిన వేళల ప్రకారం విధులకు హాజరు కావాలని సూచించారు. సచివాలయం పరిధిలో అర్హులను గుర్తించి, సంక్షేమ పథకాలకు ఎంపిక చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డులు , ఇళ్లస్థలాలు , వైయస్సార్ బీమా, జగనన్న తోడు తదితర పథకాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరిధిలో ఇంటి బకాయి పన్నులు ఉంటే ,వాటిని వెంటనే చెల్లించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలు జబ్బార్ , షర్మిల , రేష్మ ప్లానింగ్ సెక్రటరీలు శివ, కృష్ణయ్య ,రెవిన్యూ ఇన్ స్పెక్టర్ కృష్ణం రాజు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.