YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.డి ను కలిసిన ఎమ్ఆర్పిఎస్ఎస్ నాయకులు

ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.డి ను కలిసిన ఎమ్ఆర్పిఎస్ఎస్ నాయకులు

ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి ను ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం రోజున మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రక్షాళన చేసి వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ తో కర్నూలు పట్టణం నందు జాతీయ గ్రామీణ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ పి.డి ను కలిసి అతివృష్టి,అనావృష్టి వల్ల రైతులు పెట్టుబడులు పెట్టి భూమిపై చెమటలు కార్చి వేసిన పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు క్రిమి సంహారక మందులు తాగి మరణించడం జరుగుతుందని, వారి పిల్లలు అక్షరాస్యత నుంచి దూరం కావడానికి కేవలం రైతులు వేసుకున్న పంటలు పండక గిట్టుబాటు ధర రాక వలసలు పోయి కూడు,గుడ్డ,నీరు సకాలంలో వ్యవసాయ రైతులకు క్రమంగా అందకపోవడం వల్ల  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,కావున  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నతమైన అధికారులు వ్యవసాయ రైతుల పై దృష్టిసారించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం బలోపేతమే లక్ష్యంగా రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి రైతులను లాభసాటి చేయాలని రైతన్నల కళ్లల్లో చిరునవ్వు చూడాలని ఆశయంతో ఉపాధి హామీ  పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.డి కు ఎమ్ఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగ కలిసి డిమాండ్ తో కూడిన
వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో
ఎంఆర్పిఎస్ఎస్ కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాదిగ,ఎమ్మార్పీఎస్ఎస్ పత్తికొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మద్దిలేటి మాదిగ,ఎమ్మార్పీఎస్ఎస్ నాయకులు వెంకటేష్ మాదిగ,నాగేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related Posts