అవినీతి పరుల చేత అణగ తొక్క పడుతున్న సామాన్య ప్రజలకు అండగా, ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు. సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం సోమవారం తిరుపతిలోనిి రాళ్లపల్లి సుధారాణి గెస్ట్ హౌస్ లో విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ గడియం రామ్ రెడ్డి, చైర్మన్
బత్తుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జక్కా సాయి బాబు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలాలక్ష్మీపతి, షేక్ మహమ్మద్ రఫీ, చంద్రగిరి ప్రసాద్, హిమగిరి, జిల్లా నాయకులు హరిబాబు, సుభాషిణి ల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో అవినీతి అక్రమాలు తారా స్థాయికి చేరాయని నైతిక విలువలు కోల్పోతున్నాయని ప్రజా సమస్యలను ప్రభుత్వం ప్రజలకు మధ్య అనుసంధాన కర్తగా నాయకత్వం వహిస్తూ సమస్యల పరిష్కారం అయ్యేందుకు జిల్లా కమిటీ పని చేయాలని తీర్మానం చేశారు. అడిషనల్ డైరెక్టర్ గడియం వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని మిగతా సమస్యలు ఉన్నా, తమ జిల్లా కమిటీలో దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారమవుతాయని ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజంలో కూడా మార్పులు కి శ్రీకారం చుట్టాలని, మహాత్మా గాంధీ సూచనలు ఆయన ఆశయాలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర కమిటీ సభ్యులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు జరిపారు. ఇండస్ట్రియల్ కార్మికుల సమస్యలు రైతుల సమస్యలు విద్య, వైద్యం, న్యాయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అవగాహనతో ఆలోచనతో ముందడుగు వేయాలని జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కోలాలక్ష్మీపతి, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తీర్మానించారు.