కౌతాళం మండల కేంద్రంలోని గత రెండు నెలల నుంచి తాగునీరు మురికి నీరుగా వస్తుంది. మరోవైపు, కరోనా మహమ్మారి తో యావత్ ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. అయినా సరే అధికారులు తాగునీరు విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కిషన్ మోర్ఛా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఎస్ ఎస్ ట్యాంక్ ను అయన పరిశీలించారు. ఎస్ ఎస్ ట్యాంక్ లో ఫిల్టర్ బెడ్ లు ప్రాబ్లమ్ ఉండటంతో గత రెండు నెలల నుండి త్రాగు నీరు మురికి నీరుగా వస్తుందని, ఇలా రావడం వలన ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయం గురించి ఎంపిడిఓ సూర్యనారాయణకు చెప్పడం తో ఆయన కూడా ఈరోజు ఎస్ ఎస్ ట్యాంకు చూసారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కి ఫోన్ ద్వారా విషయం తెలపడం జరిగిందని అనంతరం రామకృష్ణ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తో ఫోన్ లో తాగునీటి సమస్య గురించి మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ వారం రోజుల్లో ఫిల్టర్ బెడ్ లు మారుస్తామని చెప్పారు.