కోరుట్ల మండలంలోని సంగెం,ఏకిన్ పూర్ గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్ రావు,ఎంపీపీ తోట నారాయణ, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి వరి పంటకు సమృద్ధిగా పండి కొంత అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు.మిల్లర్లు ఎలాంటి ధాన్యం కటింగ్ లు చేయవద్దని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి మద్దతు ధర పోంది లాభాల బాటలో నడవాలనే ఉద్దేశంతో ఈ సెంటర్లను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.