YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నోట్ల రద్దు తో సామాన్యుడికి కష్టాలు : టీటీడీపీ

నోట్ల రద్దు తో సామాన్యుడికి కష్టాలు : టీటీడీపీ

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన భరత దేశ ఆర్ధిక వ్యవస్థ ధెబ్బతిన్నదని టీడీపీ ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు అని ప్రకటించడం  ద్వారా సామాన్య ప్రజల పరిస్ధితి ఆర్ధికంగా ధెబ్బతిన్నదని అయన అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బడా పారిశ్రామిక వెతలు కుమ్మకై ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని అయన అన్నారు. మోడీ తప్పుడు నిర్ణయం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలుకోల్పోయారని,  పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏమైనా తప్పులు జరిగితే మోడీ గారు తనని వురి తీయమన్నారని అన్నారు.  పెద్ద నోట్ల రద్దు అన్నాడు కాని 1000 రూపాయలు రద్దు చేసి 2000 రూపాయల నోట్లు తెచ్చాడని అయన విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఒరిగింది ఏమి లేదు. కాని రద్దు వల్ల బాగుపడింది ఎవరు అంటే వ్యాపారులు మాత్రమేనని  అయన అన్నారు. బడా వ్యాపారులు కాని సినీ తరాలు కాని ఎవరు బ్యాంకుల ముందు క్యూ లో నిలబడలేదు. కాని  సామాన్యులు మాత్రం బ్యాంకుల ముందు నిలబడి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మధ్య తరగతి బ్రతుకులు రోడ్డున  పడ్డాయని ఆరోపించారు. అంతకుముందు సండ్ర వెంకట వీరయ్య, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు వైరా రోడ్డులోని ఎస్బీఐ  బ్యాంకు ముందు ధర్నా చేసారు .

Related Posts