YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బర్డ్ ఆసుపత్రికి ప్రముఖ వైద్య నిపుణుల రాక.... ఉచితంగా ఓపి సేవలు

బర్డ్ ఆసుపత్రికి ప్రముఖ వైద్య నిపుణుల రాక.... ఉచితంగా ఓపి సేవలు

బర్డ్ ఆసుపత్రిలో ఈ నెల 5, 6 తేదీల్లో ప్రముఖ వైద్య నిపుణులు ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మంగళవారం ఒక  ప్రకటనలో తెలిపారు.  5వతేదీ గురువారం బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ ఉదయం 8 నుండి 10  గంటల  వరకు ఓపి సేవలు అందిస్తారని తెలిపారు. 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చెన్నై అపోలో ఆసుపత్రికి చెందిన మెదడు, వెన్నెముక సర్జన్ డాక్టర్  బాలమురుగన్ ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ చెప్పారు. డాక్టర్ల అపాయింట్ మెంట్ కోసం 9840201902 ను సంప్రదించాలని ఆయన కోరారు. రోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.    

Related Posts