వైఎస్సార్ చేయూత ఆసరా తో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మదనపల్లి సబ్ కలెక్టర్ యం.జాహ్నవి తో కలసి వి.కోట మండలం,ముదరం దొడ్డి గ్రామం లో ఉన్న జడ్పీ హై స్కూల్ ను ,గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. జెడ్పీ హై స్కూల్ లో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించారు. గ్రామంలో ఇటీవల ప్రభుత్వం అందజేసిన వైఎస్సార్ చేయూత పొందిన లబ్ధిదారులతో మాట్లాడుతూ వైఎస్సార్ చేయూత ఆసరా తో పొందిన డబ్బులతో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా మీ కుటుంబాలు అభివృద్ధి చెండడానికి ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించి అక్కడున్న డిజిటల్ ఆపరేటర్ ను ఏ.ఏ. సమస్యల గురించి ప్రజలు ఎక్కువ అర్జీలు తీసుకుని వస్తున్నారని, వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరిస్తున్నారా.., లేదా., పరిష్కారం కానీ సమస్యలను ఎందుకు పరిష్కారం కాలేదనే విషయాలను అర్జీధారాలకు తెలియజేస్తున్నారా లేదా అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల యందు తక్కువ ఫీజుతో ఆన్ లైన్ ద్వారా సేవలు అందుతున్నాయని అనే విషయాన్ని ప్రజలకు వివరించాలని వివరాలను ప్రజలకు తెలియజేసిన చో ఎక్కువ మంది సచివాలయానికి వచ్చే విదంగా పని చేయాలని, సమస్యలతో వచ్చే వారిని ఓపికగా వారి సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలను తొందరగా పరిష్కరించాలన్నారు. రాష్ట్రప్రభుత్వ ఆములు చేస్తున్న సంక్షేమ పథకలకు అర్హులు వాటిని పొందేందుకు సమాచారం ను డిస్ ప్లే చేసారాని, పథకాలకు అర్హులైన వారి జాబితాను, అనర్హులు జాబితాను నోటీస్ బోర్డ్ లో ఏర్పాటు చేస్తున్నారా అడిగి తెలుసుకున్నారు .సచివాలయ లో అన్ని రికార్డ్స్ ను సక్రమంగా నిర్వహిస్తున్నారా, కాష్ సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చలాన ద్వారా చెల్లిస్తున్నారాని, బైయో మెట్రిక్ ద్వారా హాజరు వేస్తున్నారా, సచివాలయంలో ఏమైన సమస్యలు ఉంటే వెంటనే సంబందిత అధికారుల దృష్టి కి తీసుకురావాలని ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది అవినీతికి పలు పడినచో అలాంటి వారి పై కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ విష్ణు చరణ్, తహశీల్దారు రవి కుమార్, ఎంపీ డి ఓ బాలాజీ, ఏం ఈ ఓ చంద్ర శేఖర్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.