మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది ఇంటర్ విద్యార్ధులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని వారు 27,251 ఉండగా, మాల్‌ప్రాక్టీసు స్క్రూటినీ కమిటీ బహిష్కరించిన వారు 338 మంది ఉన్నారు. కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది