YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జర్నలిస్ట్ కు గవర్నర్ సారీ

జర్నలిస్ట్ కు గవర్నర్ సారీ

తమిళనాడు గవర్నర్ పురోహిత్  విలేకరికి క్షమాపణ చెప్పారు...రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై వివాదం చెలరేగడంతో... ఫుల్ స్టాప్ పెట్టేశారు

పరీక్షల్లో మంచి మార్కులతోపాటు బంగారు భవిష్యత్తు కోరుకుంటే తాను సుఖపెట్టాలని మదురై కామరాజ్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవి చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారమే రేపుతున్నాయి. ఈమెతో తమిళనాడు గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌‌కు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. నిర్మాలాదేవితో సంబంధం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై మంగళవారం సాయంత్రం ఆయన హడావుడిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓ మహిళా విలేకరి చెంపను తాకడం వివాదానికి కారణమైంది. రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బన్వారీలాల్‌ తనకు నిర్మలాదేవి ఎవరో తెలియదని వెల్లడించారు. సమావేశం ముగిసిన తర్వాత వేదిక దిగి కిందకు వెళ్తోన్న ఆయనను, ద వీక్ పత్రిక మహిళా జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు గవర్నర్ సమాధానం ఇవ్వలేదు సరికదా ఆమె చెంపను తాకారు. దీంతో అక్కడన్నవాళ్లంతా షాకయ్యారు.ఈ ఘటనపై జర్నలిస్ట్ లక్ష్మి సుబ్రమణియన్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ఆయన తాకిన చోట సబ్బుతో పలుసార్లు కడిగానని తెలిపారు. ‘సమావేశం ముగిసిన తర్వాత వెళ్లిపోతున్న గవర్నర్‌ను ఓ ప్రశ్న అడిగాను... దీనికి ఆయన సమాధానం చెప్పలేదు.. నా అనుమతి లేకుండా చెంపపై తాకారు. ఇది చాలా అనైతిక చర్య. అనుమతి లేకుండా ఇతరులను తాకడం ఏమాత్రం సబబు కాదు. అందులోనూ ఓ మహిళను తాకడం సరైంది కాదు’ అని ట్వీట్‌ చేశారు. ‘గవర్నర్‌ గారూ మీరు నన్ను అభినందించేందుకో, ఓ తాతయ్యలా మీరు అలా చేసి ఉంటారు.. కానీ నా ఉద్దేశం ప్రకారం అలా చేయడం తప్పు’ అని విమర్శించారు.దీంతో గవర్నర్‌ పురోహిత్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఆయన ఇలా చేయడం సరికాదని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో చేసినా.. ఓ మహిళ గౌరవానికి భంగం కలగించేలా వ్యవహరించారని విమర్శించారు. డీఎంకే నేత స్టాలిన్‌ కూడా గవర్నర్‌ ప్రవర్తనను తప్పు పడుతూ ట్వీట్‌ చేశారు.

అసలు వివాదం ఏమిటంటే..

కాలేజీ అమ్మాయిలకు డబ్బులు, అధిక మార్కులు ఆశచూపి, వారిని లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించగా, పోలీసుల అదుపులో ఉన్న నిర్మలాదేవి, విచారణలో నోరు విప్పడం లేదని తెలుస్తోంది. ఆమె సెల్ ఫోన్ లో పలువరు ప్రముఖులు, వీఐపీల నంబర్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ వివాదం పెనుదుమారం అవుతుండటంతో గవర్నర్ బన్వరిలాల్ తో కామరాజర్ వర్శిటీ వైస్ చాన్స్ లర్ చెల్లదురై భేటీ అయి, మొత్తం వ్యవహారంపై వివరణ ఇచ్చారు.కాగా, విరుదునగర్‌ జిల్లా అరుప్పు కోట్టైలోని దేవాంగర్‌ ఆర్ట్స్‌ కళాశాల మ్యాథ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలా దేవి, విద్యార్థినులను ఎవరి వద్దకు వెళ్లాలని ప్రేరేపించిందన్న విషయాన్ని తేల్చడమే లక్ష్యంగా పోలీసులు విచారిస్తున్నారు. రాత్రంతా ఆమె నుంచి సమాధానాన్ని రాబట్టే ప్రయత్నాన్ని చేసినా ఫలితం లేకపోయింది. ఆమె చేసే వాట్స్ యాప్ చాటింగ్, తరచూ మాట్లాడే నంబర్లు ఎవరివో తేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని సీబీసీఐడీ ఏర్పాటు చేసింది. సైబర్ క్రైమ్ విభాగం సైతం ఆ పెద్దలు ఎవరో తేల్చే పనిలో నిమగ్నం కాగా, ప్రభుత్వంపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ కేసులో గవర్నర్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించగా, సీబీఐకి అప్పగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదిలావుండగా, ప్రొఫెసర్ వెనకున్న వాళ్లను విచారించి కఠిన శిక్షలు విధించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. చెన్నై రాజ్ భవన్ ముట్టడికి వారు యత్నించడంతో భద్రతను పెంచారు. నిర్మలాదేవికి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించగా, మధురై సెంట్రల్ జైలుకు ఆమెను తరలించారు. ఆమెను కస్టడీకి తీసుకునే ఉద్దేశంలో ఉన్న సీబీసీఐడీ, నేడు కోర్టులో పిటిషన్ వేయనుంది.

Related Posts