YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే భారీ జరిమానా - రామగుండం ట్రాఫిక్ సిఐ జి.రమేష్ బాబు

వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే భారీ జరిమానా - రామగుండం ట్రాఫిక్ సిఐ జి.రమేష్ బాబు

వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే భారీ జరిమానా తప్పదని రామగుండం ట్రాఫిక్ సిఐ జి.రమేష్ బాబు హెచ్చరించారు. వాహనాల తనిఖీలలో భాగంగా మంగళవారం రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు గారు పొల్యూషన్ సర్టిఫికేట్ లేనటువంటి వాహనాల కు జరిమానాలు విధించకుండా వారి వాహనాలకు అక్కడే  పొల్యూషన్ పరీక్ష జరిపించి సర్టిఫికెట్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో వాహనాల వినియోగం ఎక్కువ అయిందని, కాలుష్యం ఎక్కువగా అయిపోయి దుష్ప్రభావాలు కలుగుతున్నాయన్నారు. కాలుష్యాన్ని నియంత్రించడం కొరకు సుప్రీంకోర్టు పర్యావరణానికి అనుకూలమైన బిఎస్ 6 వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేయాలని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. వాహన ఉద్గారాలు వాయు కాలుష్య ప్రమాణాలకు లోబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారని, ఎల్ పీ జీ, సీ ఎన్ జీ, డీజిల్, ఇతరులతో సహా ప్రతి వాహన రకానికి ఈ సర్టిఫికేట్ అవసరం ఉంటాయన్నారు. మీరు మీ వాహనాలను పియుసిని మీ సమీపంలో ఉన్న ఏదైనా పెట్రోల్ పంప్ లేదా స్వతంత్ర పియుసి పరీక్షా కేంద్రంలో పరీక్షించవచ్చని, పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించుకునట్లయితే ద్విచక్ర వాహనాలకు, కార్లుకు, ఆటోలకు రూ.50 వరకు తీసుకుంటారన్నారు. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహన తనిఖీలలో పట్టుబడితే రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని, ప్రతి 6 నెలలకు ఒక్కసారి కచ్చితంగా పరీక్ష జరిపించుకొని సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేనట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ చేయవని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జరిమానాలు విధించకుండా  పొల్యూషన్ పరీక్ష జరిపించి సర్టిఫికెట్ ఇప్పించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై వెంకటేశ్వర బాబు,హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts