YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజలకు ఆర్టీసీ కష్టాలు

ప్రజలకు ఆర్టీసీ కష్టాలు

ప్రజలకు ఆర్టీసీ కష్టాలు
హైద్రాబాద్, నవంబర్ 4, 
గరంలో సిటీబస్సులు తిరుగుతున్నాయో లేదో అర్థం కావడం లేదు. ఆర్టిసి అధికారులు నెల రోజుల క్రితం నుంచి 39 రూట్లలో 734 బస్సులను సిటీ బస్సులు నడపుతున్నారు.అయితే అధికారులు నడుపుతన్న బస్సులు ఏ మాత్రం సరిపోవడం లేదు. బస్సులు సంఖ్యను క్రమంగా పెంచుతామని అధికారులు చెప్పినెల రోజులు దాటినా ఇంత వరకు ఆ దిశగా ఏర్పాట్లు చేయక పొవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడటమే కాకుండా సంస్థ కూడా ఆర్థికంగా నష్టపోతోంది. గతంలో ప్రతి 10 నిమిషాలకు అందుబాటులో ఉండే బస్సులు ఇప్పుడు బస్టాపుల్లో గంట సమయం వేచి చేసినా రావడం లేదు. సాధారణంగా ఇటువంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో నెలకొంటుంది. కాని అదే పరిస్థితి నగర నడిబొడ్డున ఉన్న ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు.సమయాల్లో మరీ పరిస్థితి దారుణంగా ఉంటోంది. రాత్రి 8.30 నిమిషాలకే బస్సులన్నీ డిపోలకు చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకు గురి చేస్తోందని, దాంతో తాము ప్రత్యామ్నాయ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్‌ట్రాన్స్‌పోర్టులో భాగమైన ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని దాంతో వారు నిలువుదోపిడి చేస్తున్నారని, నగర ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో కనీసం మూడు నాలుగు రోజులు సిటీబస్సులున్నా ఆటోల్లో ప్రయాణించాల్సి రావడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామంటున్నారు. అంతే కాకుండా బస్సుపాస్‌లు తీసుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదని ఒక వైపు బస్సుపాస్‌ల రూపంలో నష్టపోతుంటే సమయనానికి రాని బస్సులు కారణంగా తమ సంపాదనలో సగం చార్జీలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు 29డిపోల ద్వారా 3550 బస్సులను ప్రతి రోజు 44 వేల ట్రిప్పులతో సమారు 10 కిలో మీటర్ల తిరుగుతూ 33 మంది లక్షల ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేవారు. దాంతో ప్రయాణికులు ఎటువంటి సమస్యలు లేకుండా తమ పనులును సులభంగా చేసుకునేవారు. కాని ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా కేవలం 20 శాతం బస్సులు అంటే సుమారు 734 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి.నగరంలో బస్సులను గతంలో మాదిరిగా తిప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ,అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బస్సులను నడుపుతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తాము నగరంలో తిప్పుతున్న బస్సులకు ప్రయాణికులు నుంచి కూడా స్పందన బానే ఉందని, బస్సులు ప్రారంభంలో నామమాత్రంగా ఉన్న ఆక్యుపెన్సీరేషియో ఇప్పుడు బాగాపెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇంత కాలం తెలంగాణ, ఆంధ్రాబస్సుల రూట్ పంచాయితీ కారణంగా సిటీబస్సులను పూర్తిస్థాయిలో తిప్పే అంశంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టలేదని అతి త్వరలో సిటీలో బస్సులను పూర్తిస్థాయిలో తిప్పే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

Related Posts