YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఇంటికే కరోనా పేషంట్స్

ఇంటికే కరోనా పేషంట్స్

ఇంటికే కరోనా పేషంట్స్
వరంగల్, నవంబర్ 4,
ఎన్ని విమర్శలు వచ్చినా సర్కారు దవాఖానాల తీరు మాత్రం మారడం లేదు. లోపాలను వెతికి పట్టుకుంటు న్నామనీ, అన్నింటిని ఒక్కొక్కొటిగా సరి చేసుకుంటూ ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరోగ్యశాఖ చెబుతున్నా ఇంకా అనుమానాలు వీడడం లేదు. కరోనా మహమ్మారి రాకతో ఆ వ్యాధికి చికిత్స చేసేందుకు ప్రత్యేక ఆస్పత్రులు, బెడ్లు, సిబ్బంది ఉన్నా ప్రజల నుంచి మాత్రం పూర్తి స్థాయి విశ్వాసం పొందలేకపోతున్నాయి. అసలే కరోనా...ఆ పైన భయం, ఆందోళన....వీటికి తోడు ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన రోగులతో వైద్యసిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు అనివార్యంగా ప్రయివేటు బాట పట్టాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. బెడ్లు, సౌకర్యాలు ఉన్న ఆస్పత్రుల్లోనూ సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడమే ఈ సమస్యలకు కారణంగా అభిప్రా యం వ్యక్తమవుతున్నది. తాత్కాలికంగా కొంత మంది సిబ్బందిని నియమించుకున్నప్పటికీ కొరత పూర్తిగా తీరలేదని సమాచారం. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామనీ, ప్రజలు ప్రయివేటుకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సర్కారు పదే పదే చెబుతున్నా ఇప్పటికీ ప్రయివేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం 1266 మంది ఉండగా ప్రయివేటు ఆస్పత్రుల్లో 1647 మంది సోమవారం నాటికి చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్పడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని 33 జిలా ్లల్లో 61 ప్రభుత్వాస్పత్రుల్లో 7295 బెడ్లు ఉం డగా, 17 జిల్లాల్లోని 226 ప్రయివేటు ఆస్పత్రుల్లో 8723 బెడ్లు ఉన్నాయి. మరీ దారుణంగా 18 ప్రభుత్వా స్పత్రుల్లో ఒక్క పేషెంట్‌ లేకపో వడం, మరో 18 ఆస్పత్రుల్లో పది లోపున రోగు లు మాత్రమే ఉండడం గమనార్హం. అన్ని సదుపాయాలు కల్పించా మని ప్రతిష్టా త్మకంగా చెప్పుకునే టిమ్స్‌ వంటి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగులు సైతం తిరి గి ప్రయివేటుకు పరుగులు తీస్తున్నారంటే ఇక మిగిలి న ఆస్పత్రుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.కరోనా చికిత్సకు సంబంధించినంత వరకు ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ రోగుల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోవడంతో అవగాహనా లోపమే కారణమని వైద్యసిబ్బంది చెబుతున్నారు. లక్షణాలు తగ్గిన తర్వాతనే ఇంటికి పంపిస్తున్నామనీ, అయితే కొన్ని సందర్భాల్లో రోగుల్లో ఇబ్బంది ఎక్కువగా ఉన్నా తిరిగి తలెత్తినా ఆస్పత్రిలో చేరవచ్చని చెబుతున్నారు. అయితే అప్పటికీ ఆందోళనకు గురవుతున్న రోగులు కొంత మంది ప్రయివేటుకు అనవసరంగా వెళుతున్నారని అభిప్రా యపడుతున్నారు. ప్రభుత్వా స్పత్రులపై ప్రజల్లో దీర్ఘకాలంగా పేరుకుపోయిన నమ్మకం లేకపోవడం కూడా ఇలాంటి భయానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం మరింత అవగాహన పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.

Related Posts