రాష్టానికి వెలుగులు నింపే పవర్ ప్రాజెక్టులు వారి జీవితాలల్లో చీకటిని నింపుతున్నాయి.. తీర ప్రాంత గ్రామాల్లో ప్రశాంతంగా బతుకుతున్న వారంతా జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.. సముద్ర వేటపై ఆదారపడి జీవిస్తున్న ఆ కుటుంబాలు రొడ్డునపడే దుస్థితి నెలకొంది.. పవర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వల్ల తమ మత్స్యసంపద చేజారిపోతోందని వారు గగ్గోలు పెడుతున్నారు.. ఇంతకీ ఈ దుస్థితి ఎక్కడ..? పాలకుల నిర్లక్ష్యం ఏంటి..? మత్య్సకారులు కోరుకుంటున్నదేంటి..?
నెల్లూరు.. పారిశ్రామికంగా శరవేగంగా అభివ్రుద్ది చెందుతున్న జిల్లా.. పదలు సంఖ్యలో పవర్ ప్రాజెక్టులు తీర ప్రాంత గ్రామాల్లో వెలిశాయి.. వాటిల్లో ఏపీజెన్ కో, గాయత్రీ, సెంబ్ కార్ప్,., థర్మల్ కేంద్రాలు.. నేలటూరు, టీపీ గూడూరు మండలాల తీర ప్రాంతాల్లో ఉన్నాయి.. ఈ రెండు మండలాల ల్లో దాదాపు 3200 మంది మత్స్సకార కుటుంబాలు సముద్ర వేటపై ఆదారపడి జీవనం సాగిస్తున్నాయి..
ధర్మల్ పవర్ ప్రాజెక్టులు వదిలే వేస్ట్ వాటర్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు నేలటూరు పట్టపుపాలెం మత్స్యకారులు.. ఈ ధర్మల్ పవర్ ప్లాంట్స్ తమ కార్యకలపాల కోసం సముద్రం నుంచి తమ కంపెనీలోకి పైపుల ద్వారా నీటిని పంపిణీ చేసుకుంటోంది.. నీటిని వినియోగించుకున్న అనంతరం మరో పైపు గుండా వేస్ట్ వాటర్ ను అదే సముద్రంలోకి వదలుతోంది.. దీంతో ఆ వ్యర్ద నీటి వల్ల సముద్రంలో ఉండే మత్స్యసంపదైన చేపలు చనిపోతున్నాయని తమ జీవనాధారం కోల్పోతున్నామని వారు వాపోతున్నారు.. తమ గ్రామాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.. మత్స్యసంపద చనిపోతుందని గ్రహించిన అప్పట్లో పనిచేసిన జిల్లా కలెక్టర్ వారిని వేరే చోటుకు తరలిస్తామని హామీ ఇచ్చారు.. కానీ నలుగురు కలెక్టర్లు మారినా ... వారికిచ్చినహామీ మాత్రం అలాగే ఉండిపోయింది.. తమ గ్రామాలను తరలించి తమకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు నేలటూరు పట్టపుపాలెం వాసులు.
మరో పక్క టీపీ గూడూరులోని మత్సకారుల విషయానికొస్తే వారు ఇంకా దుర్బర జీవితంఅనుభవిస్తున్నరు. ఈ మండలంలోని వెంకన్నపాలెం, వెంకన్నపాలెపు పట్టపుపాలెం, కోడూరుపట్టపుపాలెం, నడింపాలెం, పాతపుపట్టపుపాలెంలో 1600 మంది పై చిలుకు కుటుంబాలు వేటపై ఆదారపడి జీవిస్తున్నారు.. వీరికి వేస్ట్ వాటర్ సమస్యతో పాటు వేట సమయంలో వారు సముద్రంలోకి విసిరిన విలువైన వలలు మాయమవుతున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పవర్ ప్రాజెక్టులు తమ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న పైపులైన్లలోకి తమ విలువైన వలలు వెళ్లి అవి తెగిపోవడం, పాడై పోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు.. సముద్రం నుంచి వాటర్ ను తీసుకునేటప్పుడు, వేస్ట్ వాటర్ వదిలే సమయాల్లో తమకు తెలియజేస్తే తాము ఆ సమయంలో వలలతో వేటకు వెళ్లబోమని వారు చెబుతున్నారు.. అలా వారు ఏ సమయంలో పైపులను వినియోగిస్తారో చెప్పకపోవడం వల్ల తాము అన్ని విధాల నష్టపోతున్నామని టీపీ గూడూరు మండల వాసులు వెల్లడిస్తున్నారు..
గత కొన్ని సంవత్సరాలుగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.. సమద్ర వేటను నమ్ముకుని, నిషేదిత సమయంలో కడుపులు సైతం మాడ్చుకుని సముద్రంపై ఆదారపడి జీవిస్తుంటే ప్రభుత్వం, పవర్ ప్రాజెక్టులు తమ పొట్టకొడుతున్నాని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు వారి సమస్యలపై దుష్టి పెడతారని ఆశిద్దాం..