YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 గ్రేటర్ లో పట్టుకోసం టీడీపీ

 గ్రేటర్ లో పట్టుకోసం టీడీపీ

 గ్రేటర్ లో పట్టుకోసం టీడీపీ
హైద్రాబాద్, నవంబర్ 4, 
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి బలోపేతం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో బలంగా ఉండగలిగితేనే జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు వస్తుందని భావించిన చంద్రబాబు అందుకు అనుగుణంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలకు ప్రత్యేక కార్యాచరణ ఇచ్చి వాటిని అమలు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం అయితే తనకు రాజకీయంగా జాతీయ స్థాయిలో పట్టు పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే చంద్రబాబు ఎల్. రమణను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఎల్. రమణపై కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ తనకు నమ్మకమైన నేత కావడంతో రమణకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దూరంగా ఉంది. దుబ్బాక నియోజకవర్గంలోనూ టీడీపీ పోటీ చేయడం లేదు. అయితే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.ఈ మేరకు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు పార్టీ క్యాడర్ తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చంద్రబాబు రమణను ఆదేశించారు. పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసేందుకు కూడా అనేక మంది ముందుకు వస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించింది.దీంతో పాటుగా త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి పట్టు ఉంది. అక్కడ పోటీ చేయకపోతే గ్రిప్ కోల్పోతామని భావించిన చంద్రబాబు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో అభ్యర్థులు పోటీకి ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. రానున్న ఏ ఎన్నికలోనైనా తెలంగాణలో పోటీకి దిగాలని చంద్రబాబు నేతలను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు

Related Posts