YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాజీ మంత్రి దేవినేనికి షాక్

మాజీ మంత్రి దేవినేనికి షాక్

మాజీ మంత్రి దేవినేనికి షాక్
విజయవాడ నవంబర్ 4, 
మాజీ మంత్రి దేవినేని ఉమకు జక్కంపూడి - షాబాద్ గ్రామస్తులు షాకిచ్చారు. ఎప్పటిలానే మాజీ మంత్రి ఉమ తనదైన శైలిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులు అక్కడకు చేరుకొని మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఎదురుతిరిగి ప్రశ్నించడంతో దేవినేని ఉమ, అతని అనుచరులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు.. మా పేదల దగ్గర నుండి భూములు తీసుకున్న మీరు మాకు ఇళ్లు ఇవ్వకుండా ఎక్కడో విజయవాడలో ఉండే వాళ్ళకు ఎందుకు ఇచ్చారు..?. మాకు న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చి భూములు తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ స్థానికులు ఎదురుతిరగి ప్రశ్నించడంతో మాజీ మంత్రి వెనుదిరిగారు.

Related Posts