YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరెన్సీ నోట్లకు కార్పొరేషన్ పదవులు అమ్ముకుని బీసీల అభివృద్ధి అని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా?

కరెన్సీ నోట్లకు కార్పొరేషన్ పదవులు అమ్ముకుని బీసీల అభివృద్ధి అని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా?

కరెన్సీ నోట్లకు కార్పొరేషన్ పదవులు అమ్ముకుని బీసీల అభివృద్ధి అని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా?
కేసుల కోసం పోలవరం కాసులు వదిలేస్తారా?
విజయవాడ నవంబర్ 4, 
కార్పొరేషన్ లును ఏర్పాటు చేసి బీసీలను ఉద్దరిస్తున్నామని వైసీపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. కరెన్సీ నోట్లకు కార్పొరేషన్ పదవులు అమ్ముకుని బీసీలందరికి మేలు చేస్తున్నామని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా అని శాసనమండలి మాజీ సభ్యుడు  మంతెన సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్ ల వల్ల బీసీలకు ఒనగూరే ప్రయోజనం ఏంటి?  728 మంది డైరెక్టర్లను నియమించారు కానీ 16 నెలల్లో కనీసం ఏడుగురు బీసీలకైనా రుణాలు ఇచ్చారా? 58 మంది చైర్మన్లు, 728 మంది డైరెక్టర్లకు నెలకు రూ. 1 కోటి 18 లక్షల  జీత భత్యాల కింద ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 16 నెలల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా కనీసం రూ. 1 కోటి రూపాయలైనా ఖర్చు చేసిందా అని అయన నిలదీసారు.
గత సంవత్సరం ఏర్పాటు చేసిన మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ 3 కార్పొరేషన్లకే నిధులు ఇవ్వడం చేతకాలేదు గానీ ఇప్పుడు 139 కార్పొరేషన్లకు నిధులు ఇస్తారా? ఏ కార్పొరేషన్ అయినా నిధులు లేకుండా, కార్యకలాపాలు లేకుండా లాభాలు ఎలా ఆర్జిస్తుందో చెప్పాలి?  తప్పుడు ప్రచారం చేసుకోవడం తప్ప 16 నెలల్లో బీసీలకు ఈ ప్రభుత్వం చేసిందేంటీ?   వైసీపీ ఇకనైనా బీసీలను మోసం చేయడం మానుకోవాలని అయన అన్నారు.
పోలవరం అంశాన్ని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్ నటం విడ్డురంగా ఉంది.  ప్రతిపక్షంలో ఉన్నపుడు పోలవరాన్ని  రాజకీయాలకు వాడుకుంది వైసీపీ కాదా? ప్రతిపక్షoలో ఉన్నపుడు వైసీపీ చెసిన అసత్య ప్రచారం, సాక్షి మీడియా తప్పుడు రాతల వల్లే నేడు పోలవరానికి ఈ పరిస్థితి. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం పోలవరం నిధులు కుదించినా...ముఖ్యమంత్రి సహా ఒక్క ఎంపీ కూడా ఎందుకు  నోరుమెదపడం లేదు? జగన్ తన కేసులకు భయపడి పోలవరంకు రావాల్సిన  కాసులు వదిలేస్తారా?  వైసీపీ చేతకానితనంతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోంది. అవినీతి పరుడైన వ్యక్తి  ముఖ్యమంత్రి గా ఉండటం రాష్టానికి శాపంగా మారింది.  జగన్ ని చూసే కేంద్రం రాష్టానికి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తోందని అయన అన్నారు.

Related Posts