YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జర్నలిస్టు ఆర్నాబ్ ఆరెస్టు

జర్నలిస్టు ఆర్నాబ్ ఆరెస్టు

జర్నలిస్టు ఆర్నాబ్ ఆరెస్టు
ముంబై నవంబర్ 4,
రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర రాయిగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో నమోదైన కేసును గతంలో బిజెపి ప్రభుత్వం మూసివేసింది. అయితే శివసేన – ఎస్సీపి ప్రభుత్వం దానిని ఇటీవలే ఓపెన్ చేసి విచారణ ప్రారంభించింది.. ఈ క్రమంలోనే ముంబైలోని అర్నాబ్ ఇంటిలో బుధవారం ఉదయం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో ఇద్దరు ఫిరోజ్ షేక్ ను ఖండివల్లి నుంచి, నితేష్ సర్దాను జోగేశ్వరినుంచి అదుపులోకి తీసుకున్నారు. తనను బలవంతంగా లాక్కునిపోయి వ్యాన్ లో పడేశారని అర్నాబ్ ఆరోపించారు. పోలీసులు అర్నాబ్ భార్య, అత్తమామలు, కొడుకు పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని అంటున్నారు..
2018 లో 53 ఏళ్ళ ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి  ఆత్మహత్యకు అర్నాబ్ ప్రేరేపించారన్న ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. రిపబ్లిక్ టీవీ బకాయిలు 83 లక్షలు చెల్లించకపోవడం తనను ఆత్మహత్యకు ప్రేరేపించిందని అన్వయ్ నాయక్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. తాజాగా అర్నాబ్ అరెస్టును కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ రోజులను ఇది గుర్తుకు తెస్తోందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుడా అర్నాబ్ ఆరెస్టు ను ఖండించారు.
బుధవారం ఉదయమే దాదాపు నలభై మంత్రి పోలీసులు అయుధాలతో అర్నాబ్ ఇంటికి వచ్చారు. అ సమయంలో అక్కడున్న రిపబ్లిక్ టీవీ సిబ్బందిని ఆపివేసారు.వారి సెల్ ఫోల్లను స్వాధీనం చేసుకున్నారు.   ఆర్నాబ్ అరెస్టు పై ముంబై పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ వ్యాఖ్యానిస్తూ ఆర్నాబ్ ను ముంబైలోని అతిపెద్ద హవాలా ఆపరేటర్ గా అభివర్ణించారు.

Related Posts