YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లకు అసెంబ్లీలో నో ఛాన్స్

కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లకు అసెంబ్లీలో నో ఛాన్స్

హైకోర్టులో విజయం సాధించినప్పటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మెట్లు ఎక్కేలా కనిపించడం లేదు. కోమటిరెడ్డి,సంపత్ కుమార్ లను శాసనసభలోకి అనుమతించొద్దని టీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. శాసన వ్యవస్థను న్యాయవ్యవస్థ ఆదేశించలేదన్న కారణాన్ని చూపిస్తు స్పీకర్ తన నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ఈ వ్యవహారంపైన మౌనంగా ఉండనున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ అసెంబ్లీలోకి ఎంటర్ కావడం  అసాధ్యంగా కనిపిస్తోంది. హైకోర్టులో వీరిద్దరు విజయం సాధించినప్పటికి స్పీకర్ వీరిని సభలోకి అడుగు పెట్టనివ్వకపోవచ్చు.ఇద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న కోర్టు ఆదేశాలను సభాపతి పట్టించుకునే సూచనలు ఎంత మాత్రం కనిపించడం లేదు. హైకోర్టు ఆర్డర్స్ ను స్పీకర్ స్వీకరిస్తారా లేదా అన్నది కూడా సస్పెన్స్ గా మారింది.ఒక వేళ అసెంబ్లీ కార్యదర్శి కోర్టు తీర్పు కాఫీలను తీసుకున్నప్పటికి సభాపతి వాటిని గౌరవిస్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.గవర్నర్ ప్రసంగం సమయంలో అనుచితంగా వ్యవహారించినందుకు కోమటిరెడ్డి,సంపత్ కుమార్  శాసనసభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు.అయితే సభాపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తు వారిద్దరు హైకోర్టును ఆశ్రయించారు.అయితే వీరిద్దరి శాసనసభ్యత్వాల రద్దు  విషయంలో స్పీకర్ నియమ నిబంధనలు పాటించలేదని కోర్టు తేల్చి చెప్పింది. వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని సభాపతిని ఆదేశించింది.అయితే ఈ ఆదేశాలను స్పీకరించొద్దని స్పీకర్ నిర్ణయించినట్లుగా సమాచారం.శాసన వ్యవస్థను న్యాయ వ్యవస్థ ఆదేశించలేదని,అలాంటప్పుడు హైకోర్టు ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో కొంత మంది స్పీకర్లు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని సభాపతి భావిస్తున్నట్లు చెపుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులను స్పీకర్ మధుసుదనా చారి తీసుకోలేదు.ఆ నోటీసులకు ఎలాంటి సమాధానం కూడా ఆయన ఇవ్వలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా స్పీకర్ పక్కన పెట్టేశారు. దీంతో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ విషయంలో కూడా సభాపతి మధుసుదనా చారి ఇలాగే వ్యవహారించనున్నారు. అంటే వీరిద్దరు మళ్ళీ ఎమ్మెల్యేలుగా కొనసాగడం అసాధ్యం. అసెంబ్లీలోకి వీరు మళ్ళీ అడుగుపెట్టే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే వీరిద్దరు తొలగింపునకు సంబంధించిన అసెంబ్లీ గెజిట్ ను కోర్టు కొట్టివేసినందున ఉప ఎన్నికలు వచ్చే సూచనలు లేవు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం స్పీకర్ పరిధిలోని అయినందు వల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. కాంగ్రెస్ వైపు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నప్పటికి దీనిపైన అధికార పార్టీ మౌనంగానే ఉంది. 

Related Posts