నిడమనూరు మండలం శాఖాపురంలో అమానుష ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా లైంగిక దాడికి మృగాడు పాల్పడినట్లు నిర్దారణ అయింది. బాలిక మృగాడు, గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని మాజీ ప్రజాప్రతినిధి వద్ద మూడేళ్లుగా పాలేరుగా బాలిక తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి వద్దే డ్రైవర్ గా పనిచేస్తున్న శాఖాపురం గ్రామానికి చెందిన ఏర్పుల రమేష్ బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడి చేసాడు. అనారోగ్యానికి గురైన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో గర్భవతి గా నిర్దారణ అయింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలిక ను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఫోక్సో సెక్షన్ల తో కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనలో మరికొందరి ప్రమేయం వుందని దర్యాప్తు చేస్తున్నారు.