YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ సుప్రీంకోర్టుకు వెల్తా: ట్రంప్

ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ సుప్రీంకోర్టుకు వెల్తా: ట్రంప్

అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మోసం జ‌రుగుతోంద‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి ఆయ‌న ఇవాళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జ‌రుగుతున్న‌ద‌ని, తాము సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ప్ర‌జ‌ల పట్ల ఇది మోసం అని, మ‌న దేశానికి ఇది అవ‌మాన‌క‌ర‌మ‌ని అన్నారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల‌ను తామే గెలిచామ‌ని,  కానీ  దేశంలో స‌మ‌గ్ర‌త‌ను అమలు చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని ఆయ‌న అన్నారు.  అమెరికా చ‌రిత్ర‌లో ఈ ఎన్నిక‌లు అసాధార‌ణ‌మ‌ని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జ‌రిగింద‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క్రియ‌పై క‌ట్టుదిట్ట‌మైన చ‌ట్టాన్ని త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ట్రంప్ అన్నారు. మిలియ‌న్ల సంఖ్య‌లో ఉన్న పోస్ట‌ల్ ఓట్ల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాల‌ని అధ్యక్షుడు కోరారు.  
ప్ర‌స్తుతం వ‌స్తున్న ఫ‌లితాల ఆధారంగా బైడెన్ ముందంజ‌లో ఉన్నారు.  ట్రంప్ కూడా మ్యాజిక్ మార్క్‌కు ద‌గ్గ‌ర‌గా స‌మీపిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం బైడెన్ 237, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలుచుకున్నారు. కానీ ఇంకా కీల‌క రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది.  ఈ నేప‌థ్యంలోనే కాసేప‌టి క్రితం బైడెన్ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దాన్ని ట్రంప్ త‌ప్పుప‌ట్టారు.  ఇది అత్యంత విషాద‌క‌ర స‌మ‌య‌మ‌ని, ఈ ఎన్నిక‌ల‌ను తామే గెల‌వ‌బోతున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  కీల‌క‌మైన ఫ్లోరిడాలో తామే గెలిచామ‌ని ట్రంప్ చెప్పారు. ఓహ‌యా, టెక్సాస్ లో గెలిచామ‌న్నారు.
జార్జియాలో కూడా  గెలిచామ‌ని, అక్క‌డ 2.25 శాతం అధిక ఓట్ల‌ను గెలిచిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌న‌ల్ని అందుకునే అవ‌కాశం లేదన్నారు.  నార్త్ క‌రోలినాలోనూ 1.5 శాతం ఆధిక్యం ఉన్న‌ట్లు తెలిపారు.  ఆరిజోనాలోనూ ఫ‌లితాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌న్నారు. ఇక అత్యంత కీల‌క‌మైన పెన్సిల్వేనియాలోనూ సంపూర్ణ ఆధిక్యంలో ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. మిచిగ‌న్ రాష్ట్రంలోనూ భారీ మెజారిటీతో గెల‌వ‌నున్న‌ట్లు తెలిపారు. పెన్సిల్వేనియాలో కూడా భారీ మెజారిటీతో గెల‌వ‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.

Related Posts