మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని పట్టుకుని ఆరుగురుపై కేసు నమోదు చేశామని మీడియా సమావేశంలో జిల్లా యస్ పి నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అదిస్తున్న 200 క్వింటాల సబ్సిడీ బియ్యన్ని తరలిస్తున్న ఒక లారీ, బోలోరో ట్రాలీ వాహనాలను, 5 సెల్ ఫోన్లు మరియు 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ బియ్యాన్ని చుట్టూ ప్రక్కల ప్రాంతంలో ప్రజల వద్ద నుండి తక్కువ రేటుకు కొనుగోలు చేసి గార్ల నుండి ఖమ్మం తరలిస్తున్నారని పక్క సమాచారంతో పట్టుకున్నామని , ఇంకో ముగ్గురు నిందుతులు పరారీలో ఉన్నారని, వారిని కూడ త్వరలో అరెస్ట్ చేస్తామని, పట్టుపడ్డ వారిలో ముగ్గురు రేషన్ డీలర్లు ఉన్నారని, వారి డీలర్ షిప్ రద్దు చేస్తామన్నారు. ఈ బియ్యం సివిల్ సప్లయ్ డిపార్టుమెంటుకు అప్పగిస్తామని అన్నారు. దీనిని పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసులను యస్ పి అభినందించారు.