YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

కోలుకుంటున్న హీరో రాజ‌శేఖ‌ర్

కోలుకుంటున్న హీరో రాజ‌శేఖ‌ర్

హీరో రాజ‌శేఖ‌ర్ కోలుకుంటున్నార‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి బాగా మెరుగుపడింద‌ని ఆయ‌న స‌తీమ‌ణి జీవిత ప్ర‌క‌టించారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌త కొన్నిరోజులుగా న‌గ‌రంలోని సిటీ న్యూరో సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నారు. తొలిరోజు నుంచి ఆయ‌న‌కు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న వెంటిలేట‌ర్‌పై ఉన్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై జీవిత‌ స్పందించారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింద‌ని, ఆయ‌న త్వరగా కోలుకుంటున్నార‌ని చెప్పారు. డాక్ట‌ర్లు మెరుగైన చికిత్స అందిస్తుండ‌టంతో విషమ పరిస్థితి నుంచి బయటపడ్డార‌ని తెలిపారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వ‌స్తార‌న్నారు. ఆయ‌న‌ వెంటిలేటర్ మీద ఉన్నారని ప్ర‌చార‌మ‌వుతుంద‌ని, అది నిజం కాద‌ని చెప్పారు. రాజ‌శేఖ‌ర్‌ ఎప్పుడూ వెంటిలేటర్‌పై లేర‌ని, నిజానికి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింద‌ని వెల్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ వెంటిలేటర్ మీద మాత్రం లేర‌ని, నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించార‌ని చెప్పారు. ఇప్పుడు క్ర‌మంగా ఆక్సిజ‌న్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నార‌ని తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు చేసిన ప్రార్థనలు కారణంగానే రాజశేఖర్ క్షేమంగా ఉన్నారని జీవిత పేర్కొన్నారు.

Related Posts