జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు గా రాష్ట్రానికి చెందిన అరిశెనపల్లి జగన్ మోహన్రావు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మర్యాద పూర్వకంగా రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను అయన కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జగన్ మోహన్ రావు గారిను అభినందించారు. మంత్రి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగానికి . జగన్ మోహన్ రావు ఎన్నోసేవలు అందిచారన్నారు. అదేవిధంగా హ్యాండ్ బాల్ క్రీడకు గుర్తింపు వచ్చేవిధంగా కృషి చేయాలని మంత్రి ఈ సంధర్భంగా కోరారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి క్రీడా సంఘానికి అధ్యక్షత వహించిన ఘనత జగన్ మోహన్ రావు కి దక్కిందన్నారు.
రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలలో జాతీయ , అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. హ్యాండ్ బాల్ క్రీడకు రాష్ట్రంలో తగిన గుర్తింపు కోసం ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
హైదరాబాద్ నగరంలో హ్యాండ్ బాల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాశాఖ తరపున కృషి చేస్తామన్నారు.
టీస్పోర్ట్స్ హబ్ పేరిట అకాడమీని నెలకొల్పి వర్ధమాన క్రీడాకారులకు ఆర్థికంగానే కాకుండా అన్ని విధాల సహాయసహకారాలను జగన్ మోహన్ రావు అందిస్తున్నారన్నారు. తెలంగాణ కు చెందిన క్రీడాకారులు ఒలింపిక్స్ , అంతర్జాతీయ క్రీడా వేదికలపై మేడల్స్ టార్గెట్గా క్రీడాకారులను తయారు చేయాలని మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు సూచించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీఠ వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో దేశానికి అధర్శంగా నిలిచే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రాష్ట్రంలో ప్రవేశ పేడుతున్నామన్నారు. ఆసియా హ్యాండ్ బాల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ జాతీయ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ను హైదరాబాద్ వేదికగా నిర్వహించి జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టి ఆకర్షించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్ బాల్ క్రీడా ఉన్నత స్థితికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇండోర్ గేమ్ అయిన హ్యాండ్బాల్ మౌలికవసతుల వెనుకుబాటుతో మెట్రో నగరాలు మొదలు గ్రామాలు వరకు అవుట్డోర్ స్పొర్ట్స్ లా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిష్ణాతులైన కోచ్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ హంట్ నిర్వహించి మెరికలాంటి క్రీడాకారులను జల్లెడపట్టి ప్రోత్సహించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమములో తాండూర్ శాసన సభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఇండియన్ మాజీ హాకీ క్రీడాకారుడు చంధ్రశేఖర్, రఘునంధన్ రెడ్డి లు పాల్గొన్నారు.