ప్రముఖ పారిశ్రామికవేత్త, అల్లూరు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్, మినర్వా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి చిత్రపటానికి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం, అల్లూరు గ్రామ నివాసి అయిన వల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి అనారోగ్యంతో ఇటీవల అకాల మరణం చెందారు. ఆయనకు బుధవారం నెల్లూరులోని ఆయన స్వగృహం నందు ఘనంగా కర్మ క్రతువులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న బీద రవిచంద్ర, విజయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, రేబాల శంకర్ రెడ్డి, బండి శ్రీనివాసరెడ్డి, నీలపు రెడ్డి హరీష్ రెడ్డి, మాజీ సర్పంచ్ అనురాధ మరియు స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.