YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చైర్మన్లు, డైరెక్టర్లను అభినందించిన మంత్రి బాలినేని

చైర్మన్లు, డైరెక్టర్లను అభినందించిన మంత్రి బాలినేని

బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం తానిక మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్న చెరుకుపల్లి పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీసీ కులాల అభివృద్ధి కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ కులాలు అభివృద్ధికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు నూతనంగా ఎంపికైన చైర్మన్లు, డైరెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం అవుతుందని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్లను, డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు పోలుబోయిన బోయిన అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts