మాధవి లత ఎవరు. మాధవి లత హీరోయిన్ గా చేసినవి రెండే సినిమాలు. 2007 లో మహేష్ బాబు నటించిన "అతిధి" సినిమా లో హీరోయిన్ చెల్లలు పాత్ర తో తెలుగు తెర కి పరిచయం ఆయింది. తరువాత 2008 లో "అల్లరి" ఫేమ్ రఘుబాబు దర్శకత్వం లో "నచ్చావులే" అనే సినిమా ఒకటి, రెండోది 2009 లో నాని హీరో గా నటించిన "స్నేహితుడు" సినిమా లో కథానాయికగా నటించింది. తరువాత ఆమెకు ఆఫర్ లు పెద్దగా రాలేదు. ఈ మధ్య ఒక తమిళ సినిమా లో చిన్న పాత్ర పోషించింది. తెలుగు ప్రేక్షకులకు కనుమరుగు అయింది. ఈ మధ్య కాలం లో కొని ఇంటర్వ్యూ లో మెరిసి కాస్టింగ్ కౌచ్ అనేది టాలీవుడ్లో ఉంది అని చెప్పింది. కానీ ఆమె శ్రీ రెడ్డి లా ధైర్యం చేసి బయటికి వచ్చి పోరాడలేదు. ఈ మధ్య ఆమె పేస్ బుక్ లో,యూట్యూబ్ లో కొన్ని కొన్ని వీడియోలు చేస్తూ జనానికి నేను కూడా ఉన్నాను అనే సంకేతాలు ఇచ్చేది. కానీ మొన్న కాస్టింగ్ కౌచ్ వివాదం లో పవన్ కళ్యాణ్ ఫై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు ఆమె బయటికి వచ్చి నిరసన తెలియచేసింది, మౌన దీక్ష చేస్తుంది. రెండు నెల్లలు నుంచి జరుగుతున్న ఈ వివాదం లో సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కానీ మాధవి లత రావడం తో ఆమె జనసేన లో చేరుతుందా లేక కత్తి మహేష్, శ్రీ రెడ్డి లా పవన్ కళ్యాణ్ ని అడ్డుపెట్టుకుని పాపులారిటీ తెచ్చుకుందాం అని చూస్తుందా అని జనాలు,సినీ పెద్ద లు అనుకుంటున్నారు. ఇది మాధవి లత పబ్లిసిటీ స్టంట్ఆ లేదా కొత్తగా పుట్టిన పార్టీ ప్రమోషనా.!!