రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో బిసిగర్జన సభలో ఇచ్చిన మాట మేరకు గత ఎన్నో సంవత్సరాలుగా మోసపోయిన బిసి లకు నేనున్నానని, ఏ రాష్ట్రంలో జరగని విధంగా నేడు వెనుకబడిన కులాలకు 56 మందికి అద్యక్ష పదవులు 675 మందికి మెంబర్లు/ డైరెక్టర్లు గా పదవులిచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక పి.ఎల్. ఆర్. గ్రాండ్ హోటల్ లో చైర్మన్లు, డైరెక్టర్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు, అభినందనలు తెలిపే కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ అభినందన సభకు చిత్తూరు శాసన సభ్యులు అధ్యక్షత వహించి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని బిసి పదవులు మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 56 మందికి అధ్యక్ష పదవులు, 675 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని అందుకే వారి కోరిక మేరకు థాంక్యూ సి.ఎం.జగన్ మోహన్ రెడ్డి సార్ అనే నినాదాలతో కృతజ్ణతలు తెలుపనున్నామని అన్నారు.
రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ గతంలో వెనుకబడిన కులాలను ఓటు బ్యాంకుకు వాడుకునేసి వదిలేసేవారని, మన ముఖ్యమంత్రి బిసి గర్జన సభలో ఇచ్చిన మాట మేరకు ఒక శాసన మండలి సభ్యత్వం ఖాళీ అయితే అది కూడా బిసి లకు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి తన 14 నెలల తన పాలనలో 29 సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. మొట్ట మొదటి శాసన సభ సమావేశాలలో 50 శాతం రిజర్వేషన్ల చట్టం చేసిన ఘనత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దేనని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి ఏమి లేకుండా చేశారని, నేడు మన ముఖ్యమంత్రి యువతకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వార్డు, గ్రామ సచివాలయాలలో కల్పిస్తే అందులో 1,26,000 మంది వెనుకబడిన తరగతులకు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయాల మేరకు నేడు పదవులు చేపట్టిన ఛైర్మన్లు, డైరెక్టర్లు అర్హత గల ప్రతి వారికి సంక్షేమ ఫలాలు అందేలా దృష్టి పెట్టాలని అన్నారు.
ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వీడియో సందేశం ద్వారా సభలో ప్రసంగిస్తూ నేడు పదవులు చేపట్టిన బిసి ల నాయకులు పూర్తి విశ్వాసంతో జగనన్నకు అండగా నిలవాలని , స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని కులాలకు బిసి, ఎస్సీ, ఎస్టీ కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా న్యాయం జరుగుతున్నదని , రాష్ట్ర అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని అన్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు నలుగురికి అద్యక్ష పదవులు, 53 మందికి డైరెక్టర్ పదవులు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి చొరవతో అందాయని, నేడు ఇది బిసి లకు శుభదినమని అన్నారు. పదవులు చేపట్టిన మీరు ప్రతి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, కృతజ్ఞతగా మనం కలిసి పనిచేయాలని అన్నారు.
ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా వెనుకబడిన వర్గాలలో ఇంకెంతకాలం ఈ కట్టుబాట్లు , ఇంకెతకాలంలో మన అభివృద్ధి జరిగేది అని భాద పడే రోజుల్లో నేనున్నానని మన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక కట్టుబాట్లలో మార్పు తెచ్చి ఆర్థికంగా ఎదుగుదల కావాలని దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా బీసీలకు ఇన్ని పదవులు కట్టబెట్టారని అన్నారు. రాజకీయనాయకులు బిసి లను వాడుకుని వదిలేస్తే, నేడు బిసి లే వెన్నుముఖ అని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి ఇన్ని పదవులు ఇచ్చారని, మీరు ఆయన ఆశయం మేరకు సైనికుల్లా పనిచేయాలని అన్నారు.
ఎ పి ఐ ఐ సి ఛైర్మన్ రోజా మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా మోసపోతున్న బిసి లను గుర్తించి మన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 139 బి సి కులాలకు 56 మంది ఛైర్మన్ పదవులు కట్టబెట్టారని గతంలో బిసి లను వెన్నుపోటు పొడిస్తే , నేడు బిసి లంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని గుర్తించిన వ్యక్తి మన జగనన్న అని అన్నారు. ఇచ్చిన మాట మేరకు 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని అన్నారు. బిసి లకు గౌరవం ఇచ్చి 2,70,000 మందికి రూ.33 వేల కోట్లు సంక్షేమ పథకాలు అందించి అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టారని అన్నారు.
చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడెప్ప మాట్లాడుతూ మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తి మన మంత్రి పెద్దిరెడ్డి అని వారిపై ప్రతిపక్షాలు అబద్దాలు చెప్పినా నమ్మే వారు లేరని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సారాల కాలంలో బిసి లను గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా అధినేతగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు చిత్తూరు ఎం పి గా పోటీచేసే అవకాశం కల్పించారని అన్నారు. గత ప్రభుత్వాలు బిసి లకు చేసిందేమి లేదని, న్యాయం చేసిన వ్యక్తులను గుర్తించుకొని వారి అడుగు జాడల్లో నిలవాలని కోరుతున్నాని అన్నారు.
తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ బిసి లు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇన్ని బిసి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇవ్వలేదని దేశ చరిత్రలోనే ఇది మొదటిదని అన్నారు. క్రింది స్థాయిలో ఉన్న బిసి కులాలను, పై స్థాయికి తీసుకుని వచ్చి వారిని ఆర్థికంగా ఆదుకొని, వారికి స్వావలంబన కల్పిస్తున్నారని అన్నారు. 30 , 40 వేలు ఉన్న బిసి లకు కూడా న్యాయం జరగాలని ఛైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారని ముఖ్యమంత్రి ఆశయం మేరకు పదవులు అందుకున్న మీరు పని చేయాలని కోరారు.
పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ బిసిలకు ఇన్ని పదవులు అందడం సంతోషకరమని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించి చైర్మన్లు, డైరెక్టర్లు మన్ననలు పొందాలని అన్నారు.
తంబళ్లపల్లి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కూడా ముఖ్యమంత్రి బిసీలకు న్యాయం చేయాలనే ఆలోచన నేడు ఒక పండగ దినంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమం వైపు శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు మా కుటుంబంపై ఆరోపణలు చేస్తూ విలువలు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. మానుండి ఎవరికీ చెడు జరగదనే విషయం తెలిసి బిసిలు, ఎస్సీ లు, ఎస్టీ లు మాకు అండగా నిలిచే వ్యక్తులే కానీ ఆరోపణలు చేసే వ్యక్తులు కారని అన్నారు.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూధన రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో స్వయంకృషితో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని , చరిత్రలో లేని విధంగా నేడు బిసి లకు 56 ఛైర్మన్ పదవులు కట్టబెట్టారని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 62 శాతం మంది బి సి కాంట్రాక్టర్లకే ముఖ్యమంత్రి ఆశయం మేరకు పనులు అప్పజెప్పామని , కరోనా కష్ట కాలంలో మన ముఖ్యమంత్రి అన్ని విధాలా, అందరినీ ఆదుకుంటున్నారని అన్నారు .