సురక్షితమైన, సమర్థవంతమైన కొవిడ్ టీకా వచ్చే ఏడాది జనవరిలోనే అందుబాటులోకి వస్తుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు పూణే ఆధారిత వ్యాక్సిన్ తయారీదారు బ్రిటిష్- స్వీడిష్ ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ పేరుతో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. యూకేలో నిర్వహించిన ట్రయల్స్ విజయవంతమయ్యాయని, నియంత్రణ సంస్థల నుంచి ఆమోదాలు సకాలంలో వస్తే జనవరి నాటికి టీకా దేశంలో ఆశించవచ్చని చెప్పారు.