YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

"స్వచ్ఛ్ భారత్" నిధులను పక్కదారి పట్టిస్తున్నతెలంగాణా ప్రభుత్వం మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

"స్వచ్ఛ్ భారత్" నిధులను పక్కదారి పట్టిస్తున్నతెలంగాణా ప్రభుత్వం       మాజీ కేంద్ర మంత్రి   బండారు దత్తాత్రేయ

ప్రధాన మంత్రి పిలుపుమేరకు దేశవ్యాప్తంగా "స్వచ్ఛ్ భారత్" కార్యక్రమము లో భాగంగాబుదవారం హైదరాబాద్ లోని  ముషీరాబాద్ నియోజకవర్గం హరినగర్ లో ఎం పిమాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ,  ఎమ్మెల్యే   డాక్టర్ కె లక్ష్మణ్ లతో కలిసి స్వచ్ఛ్ భారత్" కార్యక్రమాన్నినిర్వహించారు.ఈ సందర్భంగా  బండారు దత్తాత్రేయ  మాట్లాడుతూ " ప్రజలు ఎన్జీవోలు, కాలనీ వాసులు,  బస్తీ వాసులు ఈ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుప్పలుకుప్పలుగా నాలాల సమీపంలో చెత్త పేరుకుపోయి సమస్య తీవ్రమౌతుందని ఆందోళన వ్యక్తంచేసారు.  హైదరాబాద్ నగరంలో పారిశుద్ధత లోపించిందని అన్నారు. జి.హెచ్.ఎం.సి పారిశుద్దనిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2,88,204  మరుగుదొడ్లను నిర్మించింది. ఒక్కొక్క యూనిట్ కి పదివేల రూపాయలు  చొప్పున ఇస్తుండగా రాష్ట్ర  ప్రభుత్వం కేవలం మూడు వేలరూపాయలు మాత్రమే ఇస్తూ ఆ నిధులు సైతం సరిగ్గాకేటాయించకుండా పధకాన్ని నీరుగారుస్తున్నారు.రాష్ట్రంలో అధికారం చేపట్టిన కొత్తలో ముఖ్య మంత్రి గారు హైదరాబాద్ నగరంలో పర్యటించినగరాన్ని 400 డివిజన్లు గా విభజించి ఒక్కో డివిజన్ ను ముఖ్య మంత్రి తో బాటు రాష్ట్ర గవర్నర్మాత్రమే గాక మంత్రులు మరియు అధికారులకు కేటాయించి నానా హడావిడి చేశారు.  కానీసమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్టు నేటికీ సమస్యల పరిష్కారం లో ఎలాంటిపురోగతి లేదు. ప్రభుత్వ చేష్టలు గొప్పలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉన్నాయనిఅభివర్ణించారు.   దీనిపై ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.స్వచ్ఛ్ సర్వేక్షన్ ర్యాంకుల్లో హైదరాబాద్ నగరం  19 స్థానం లో ఉన్నందున పరిస్థితిని మెరుగుపర్చేందుకు జి.హెచ్.ఎం.సి తో పాటు ప్రజలందరు కూడా భాగస్వాములు కావాలనిపిలుపునిచ్చారు.  

Related Posts