YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఎందుకు జగన్ మౌనం...

ఎందుకు జగన్ మౌనం...

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఏపీతో ఆడుకుంటూనే ఉంది. ప్రభుత్వాలు మారినా… ఈ ఆట‌లు మాత్రం సాగుతున్నాయి. గ‌తంలో చంద్రబాబు హయాంలో మోడీకి-బాబుకు చెడింది కాబట్టి.. బాబుపై ఉన్న కోపంతోనే ఏపీకి రావాల‌సిన ప్రత్యేక హోదా ఇవ్వలేద‌ని, ఏపీకి అన్యాయం చేస్తున్నార‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్పుడు తాను కేంద్రంతో స‌ఖ్యత‌తో ఉన్నప్పటికీ.. ఎందుకు సాధించ‌లేక‌పోతున్నారు? అనేది కీల‌క ప్రశ్న. అదే స‌మ‌యంలో ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో మ‌రో రెండు విష‌యాల్లో కేంద్రం ఏపీతో చెల‌గాటం ఆడుతోంది.వీటిలో కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను భారీగా కుదించేసింది. అప్పుడెప్పుడో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పెట్టిన అంచనాల మేరకే నిధులు ఇస్తాం.. అంత‌కు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేద‌ని తెగేసి చెబుతోంది. ఈ విష‌యంలోనూ జ‌గ‌న్ ప్రభుత్వం కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేలా పోరాటం చేయ‌డం లేదు. పైగా చంద్రబాబు వ‌ల్లే ఇలా జ‌రిగిందంటూ ఎదురు దాడి చేస్తోంది. నిజానికి పోల‌వ‌రం అంచ‌నాలు పెంచుతూ.. చంద్రబాబు స‌ర్కారు 2018లో కేంద్రానికి లేఖ రాసింది. అప్పట్లో ప్రతిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ ఈ అంచ‌నాలు అవినీతి కోస‌మే అంటూ లేఖ‌రాశారు. దీంతో ఇవి ఖ‌రారు కాలేదు.కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. బాబు చెప్పిన అంచ‌నాలే క‌రెక్ట్‌.. ఆ మేర‌కు రు. 55 వేల కోట్లకు ఖ‌రారు చేయండి . త‌క్షణం రు. 15 వేల కోట్లు ఇవ్వండి అంటూ.. జ‌గ‌న్ అభ్యర్థించారు. కానీ, అప్పట్లో మీరే క‌దా అంత భారీ అంచ‌నాల వెనుక అవినీతి ఉంద‌ని చెప్పింది.. అన్న ఎదురు ప్రశ్నకు జ‌గ‌న్ కూడా స‌మాధానం చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో కేంద్రం పోల‌వ‌రం విష‌యంలో త‌న ఇష్టానుసారం ఆడుకుంటోంది. మ‌రో వైపు అమ‌రావ‌తి విష‌యంలోనూ ఇదే విధంగా వ్యవ‌హ‌రిస్తోంది. అమ‌రావ‌తి విష‌యంలో ఏదీ తేల్చలేదు.రాజ‌ధానులు ఉండ‌డం త‌ప్పుకాద‌ని చెబుతున్నా.. జ‌గ‌న్‌కు అనుకూలంగా మాత్రం అనుమ‌తులు ఇవ్వడం లేదు. ఇలా ప్రభుత్వాలు మారినా.. కేంద్రం పెత్తనం మాత్రం పెరుగుతూనే ఉంది. వీటికి అడ్డుక‌ట్ట వేయ‌డంలో అప్పటి బాబు , ఇప్పుడు జ‌గ‌న్ కూడా చేతులు ఎత్తేస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ అవ‌స‌రం ఇప్పుడు కేంద్రానికి కూడా ఉంది. లోక్‌స‌భ‌లో కావొచ్చు.. రాజ్యస‌భ‌లో కావొచ్చు జ‌గ‌న్ మ‌ద్దతు బీజేపీకి ఎప్పుడూ కావాలి. కానీ ప్రతిసారి ఓటింగ్‌లో బీజేపీ అడ‌గ‌కుండా జ‌గ‌నే ముందుగా మ‌ద్దతు ఇస్తామ‌ని సాగిల ప‌డుతోన్న ప‌రిస్థితి ఉంది.అదే త‌న‌కున్న ఎంపీల బ‌లంతో జ‌గ‌న్ కాస్త బెట్టు చేస్తే కేంద్రం త‌ప్పక దిగి రావాల్సిన ప‌రిస్థితి ఉంది. జ‌గ‌న్ ఈ విష‌యంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లక‌పోవ‌డంతో బీజేపీ, కేంద్రం కూడా ఎలాగూ త‌మ‌కే మ‌ద్దతు ఇస్తాడులే అని ముందే డిసైడ్ అవుతున్నారు. పోనీ జ‌గ‌న్ ఇంత చేసినా ఏపీలో బీజేపీ జ‌గ‌న్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తూనే ఉంది. ఇక‌పై అయినా జ‌గ‌న్ స‌రైన వ్యూహంతో కేంద్రాన్ని త‌న దారిలోకి తెచ్చుకుంటారో ? లేదో ? చూడాలి

Related Posts