YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సంస్కరణల బాటలో బల్దియ క్రీడా విబాగం

 సంస్కరణల బాటలో బల్దియ  క్రీడా విబాగం

జీహెచ్ఎంసీ  ప‌రిధిలో  క్రీడా మైదానాల్లో ఉన్న క్రీడాంశాల్లో శిక్ష‌ణ‌కు హాజ‌ర‌య్యేవారు న‌మోదుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన బ‌ల్దియా తాజాగా స్పోర్ట్ మెటీరియ‌ళ్ల పంపిణీని కూడా మ‌రింత పార‌ద్శ‌కంగా నిర్వ‌హించేందుకు స‌రికొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా న‌గ‌రంలోని స్విమ్మింగ్ పూళ్లు, క్రీడా మైదానాల్లో వివిధ క్రీడాంశాలైన బ్యాడ్మింట‌న్, క్రికెట్, వాలీబాల్ త‌దిత‌ర రంగాల్లో శిక్ష‌ణ పొందేవారు అవ‌క‌త‌వ‌క‌ల‌కు తావులేకుండా పార‌ద‌ర్శ‌కంగా ఆన్‌లైన్ విధానంలో స్లాట్‌ను బుకింగ్ చేసే విధానాన్ని జీహెచ్ఎంసీ మొద‌టి సారిగా ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా పైర‌వీలకు తావులేకుండా అత్యంత పార‌దర్శ‌కంగా ఎంట్రీల న‌మోదుతో న‌గ‌ర వాసుల నుండి ప్ర‌శంస‌లు పొందింది. తాజాగా ఏఏ క్రీడాంశాల్లో ఎంత మొత్తంలో క్రీడా ప‌రిక‌రాలు, సామాగ్రి అవ‌స‌రం అనేది ఆన్‌లైన్ స్లాట్‌ల బుకింగ్ ఆధారంగా సంబంధిత గేమ్స్ ఇన్‌స్పెక్ట‌ర్లు త‌మ డిప్యూటి క‌మీష‌న‌ర్ల ద్వారా జోన‌ల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌కు ఇండెంట్‌ పంపించాల్సి ఉంటుంది. డిప్యూటి క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు ఈ ఇండెంట్‌ను ప‌రిశీల‌న చేసిన పిద‌ప జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఆమోదిస్తారు. దీనితో ఆయా స‌ర్కిళ్ల‌లో కావాల్సిన స్పోర్ట్ మెటీరియ‌ళ్ల వివ‌రాలు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. అయితే, స్పోర్ట్స్ జోన‌ల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు పంపిన ఇండెంట్‌ను ఆన్‌లైన్‌లో ప‌రిశీలించ‌డానికి సీనియ‌ర్ అధికారులైన స్పోర్ట్ విభాగం అడిష‌న‌ల్‌ క‌మిష‌న‌ర్‌, డైరెక్ట‌ర్‌తో పాటు విజిలైన్ డైరెక్ట‌ర్ కూడా ప‌రిశీలించేలా లాగిన్ ఇస్తున్నారు. దీనివ‌ల్ల గ‌తంలో మాదిరిగా కాకుండా ప్ర‌స్తుతం కేవ‌లం ముందుగా ఆమోదించిన మేర‌కే స్పోర్ట్స్ మెమోరియ‌ల్‌ను అందించ‌నున్నారు. త‌ద్వారా క్షేత్ర‌స్థాయి త‌నిఖీలో ఏఏ స్టేడియంలో సంబంధిత క్రీడా అంశానికి ఎంత మొత్తంలో క్రీడా మెటీరియ‌ల్‌ను పంపిణీ చేసిన వివ‌రాలు అందుబాటులో ఉంటాయి. త‌ద్వారా గ‌తంలో మాదిరిగా రికార్డుల్లో అదిక‌మొత్తంలో క్రీడా సామాగ్రి చూపించ‌డం క్షేత్ర‌స్థాయిలో కొర‌త‌గా ఉండే ఫిర్యాదులు ఇక నుండి దూరం కానున్నాయి. 

Related Posts