తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఆమాన్ గల్ కి చెందిన వినోద్ కుమార్ బిటెక్ చదివి మధ్యలో ఆపేశాడు. కార్ డ్రైవర్ గా పని చేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్ తో కలిసి చోరీలు మొదలు పెట్టాడు. గతంలో పిడి యాక్ట్ మీద జైల్ కి కూడా వెళ్లి వచ్చాడు. మళ్లీ నిందితుడిపై పిడియాక్ట్ నమోదు చేస్తున్నామని అన్నారు. నిందితుల కోసం నాలుగు జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలించాం. 2017 జైల్ నుండి బయటకు రాగానే మరోసారి చోరీలకు తెగబడ్డారు. నిందితుల నుండి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని అయన అన్నారు.