YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం మత్తులో రోకలిబండతో భార్యపై భర్త దాడి…మహిళా తలకు తీవ్ర గాయం

మద్యం మత్తులో రోకలిబండతో భార్యపై భర్త దాడి…మహిళా తలకు తీవ్ర గాయం

మద్యం మత్తులో భార్యపై తలపై భర్త రోకలిబండతో దాడి చేసిన సంఘటన బుచ్చిరెడ్డిపాలెం పట్టణం మంగలి కట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగలి కట్టకి చెందిన సుజనా, నాగేంద్ర భార్య భర్తలు. భర్తతో గొడవలు రావడంతో సుజనా పిల్లలతో కలిసి గత ఐదు నెలలుగా పుట్టింట్లో ఉంటోంది.. ఈ నేపథ్యంలో భర్త నాగేంద్ర పుట్టింటికి వచ్చి తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి మంగళ కట్టలోని అత్తారింటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ సమయంలో ఇంట్లో భార్య ఒంటరిగా ఉండటం తో రోకలిబండతో ఆమె పై దాడి చేసి పరారయ్యాడు. దీంతో మహిళ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుండి వివరాలు నమోదు చేసుకున్నారు.

Related Posts