విశాఖపట్టణంలోని స్టీల్ ప్లాంట్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని టీపీసీ-2లో టర్బైన్ ఆయిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదం వల్ల 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధమయ్యాయి. సుమారు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పడంతో పెనుప్రమాదమే తప్పింది. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.