YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్లాన్

 చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్లాన్

చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ సిద్దమయ్యారు. ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. ఇందుకు స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు పూర్తిగా సహకరించారు. జగన్ మాట్లాడుతున్నంత సేపు అడ్డుకునే పని చేసింది టీడీపీ. ఫలితంగా అసలు అసెంబ్లీకి వెళ్లడమే మానేసింది వైసీపీ. వారి వైఖరికి నిరసనగా గత రెండు దఫాలుగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదు వైసీపీ నేతలు.  టీడీపీ వైఖరికి నిరసనగా జూన్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారట. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించిన వైకాపా ఉద్యమంలో టీడీపీ కంటే ముందు ఉంది. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తటపటాయించారు. వెనక్కు తగ్గారు. అసలు ఎంపీలతో నియోజకవర్గాలు తిప్పేందుకు ప్రయత్నించినా వారు ఒప్పుకోక పోవడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.. చంద్రబాబు, బీజేపీల వల్లనే ఏపీకి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అందుకే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించనున్నారు. రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబు కొన్ని సార్లు జగన్ ను అనుకరించాల్సి వస్తోంది. జగన్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టించారు. ఎక్కడ వారికి మైలేజ్ వస్తుందోనని తాను అదే పని చేశాడు టీడీపీ అధినేత. వైకాపా పార్టీ ఎంపీలు ఢిల్లీలో దీక్షకు దిగితే.. చంద్రబాబు అమరావతిలో అదే పని చేయనున్నారు. మొత్తంగా ఇప్పుడు చంద్రబాబు జగన్ బాట పడుతున్నారని చెప్పవచ్చు. వైకాపా నేతలు ర్యాలీలు, ప్రదర్శనలు, యాత్రలు, ఆందోళనలు చేస్తుంటే.. టీడీపీ అదే పని చేస్తోంది. నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న టీడీపీ ఇప్పుడు తామే అంతా చేస్తున్నామనిపించుకునేందుకు తహతహ లాడుతోంది. కానీ జనం అంత తేలికగా టీడీపీని నమ్మడం లేదు.హోదా విషయంలో మాటలు మార్చినందుకు చంద్రబాబును మేము నమ్మడం లేదంటూ అఖిల పక్షానికి ఏ పార్టీ వెళ్లలేదు. ఇది చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశమే. కనీసం కమ్యూనిస్టు నేతలు ఆయనతో కలిసి రాక పోవడం మరింత విచిత్రమే. ప్రత్యేకహోదా పోరాటం, చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయనుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

Related Posts