YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మెజార్టీ వచ్చిన ఇబ్బందులేనా

 మెజార్టీ వచ్చిన ఇబ్బందులేనా

ఏది ఎక్కువైనా ముప్పే అని సామెత. విషయానికి వస్తే ఏపీలో జగన్ పార్టీని జనం అలా ఇలా మెచ్చలేదు. ఏకంగా 151 సీట్లను ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. 50 శాతానికి పైగా ఓట్లు ఇచ్చారు. దీంతో జగన్ మహా బలుడు అని అన్నారంతా. రాజకీయ బాహుబలి అని అభిమానులు పొంగిపోయారు. కానీ ఇపుడు ఏడాదిన్నర పాలన చూశాక జగన్ అనుకున్నట్లుగానే అన్నీ చేయగలుగుతున్నారా అంటే అబ్బే లేదే అన్న జవాబే వస్తుంది. జగన్ చాలా విషయాల్లో దూకుడుగా వెళ్ళి ముక్కు గుద్దేసి వెనక్కు వస్తున్నారు. దీంతో ఆయనకు ఆవేశం పెరుగుతోంది, చూసే జనాలకు ఆయాసం వస్తోంది.టైంలో కూడా రెబెల్స్ ఉండేవారు. ఆయన ముక్కుసూటిగా రాజకీయం చేస్తూ రావడం వల్ల ఆయనను తట్టుకోలేక చాలా మంది వెళ్ళిపోయారు. మరికొందరిని రామారావు బయటకు పంపించేశారు. అలా వెళ్లిన వారు కొన్నాళ్ళు మీడియాలో వెలిగారు, ఆ తరువాత సైడ్ అయ్యారు. దానికి కారణం ఎన్టీయార్ కి రాజకీయం తెలియకపోయినా పక్కన చంద్రబాబు లాంటి వారు ఉండడమే. ఇక ఇపుడు జగన్ విషయానికి వస్తే ఆయనకూ అన్నగారికీ ఈ విషయంలో బాగా పోలిక కుదురుతుంది. కానీ ఆయన పక్కన బాబు ఉన్నారు. ఆయన మాట విన్నారు. జగన్ పక్కన ఎవరు ఉన్నారో తెలియదు కానీ ఆయన నిర్ణయాలు మాత్రం బెడిసికొడుతున్నాయి. ఎన్టీయార్ తాను అనుకున్న దాన్ని చేసుకుంటూ పోయారు. జగన్ మాత్రం అలా చేయలేకపోతున్నరు. అదే ఇక్కడ తేడాజగన్ విషయమే తీసుకుంటే ఆయనకు శత్రువులు ఎక్కువే. ఒక్కసారి జగన్ తో విభేదిస్తే వారు జీవితకాలం అలాగే ఉండాల్సిందే. ఇపుడు రెబెల్ ఎంపీ రఘురామరాజుకు జగన్ తో తేడా వచ్చింది. ఆరు నెలలుగా ఆయన జగన్ మీద నోరు పారేసుకుంటూనే ఉన్నారు. ప్రతీ రోజూ రచ్చ బండ నిర్వహించి మరీ జగన్ మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. జగన్ మాత్రం ఆయన్ని ఏమీ చేయలేకపోతున్నారు. తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ సర్కార్ కూలిపోవాలని ఆయన కోరుకోవడం కంటే ఘోరం ఇంకోటి ఉందా. ఆయన్ని జగన్ సస్పెండ్ చేయడం లేదు. అలాగని అనర్హత వేటు వేయించలేకపోతున్నారు. దాంతో తొడగొట్టి మరీ రాజావారు జగన్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. మరి జగన్ కి వచ్చిన భారీ మెజారిటీ కానీ, జనాదరణ కానీ ఇక్కడ ఏమైనా పనికొచ్చాయా అంటే లేదనే జవాబు చెప్పాలి.ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఎపుడు నిర్వహించాలి అన్నది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ జగన్ చేసుకున్న పాపం ఏంటో అంత బండ మెజారిటీ వచ్చి కూడా ఆయన్ని చాలా సులువుగా పక్కన పెట్టేస్తున్నారు. పైగా ప్రతిపక్షాలు కోరుకున్నట్లుగా ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. మళ్ళీ జరగబోతున్నాయి. అంటే ఇక్కడ జగన్ సర్కార్ ఫెయిల్యూర్ గానే చూడాలి. మరో విషయం ఏంటంటే జగన్ మూడు రాజధానులు అన్నారు, అది ఆగిపోయింది. ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలు అని గట్టిగా చెప్పుకున్నారు. అది కూడా అమలు కాలేదు, ఇంగ్లీష్ మీడియం అన్నా ఆచరణలో ఆమడ దూరం ఉంది. ఇలా జగన్ తాను ఒక సీఎం గా చేయాల్సినవి ఎందుకు చేయలేకపోతున్నారో సమీక్షించుకోవాల్సిందే. జగన్ ఎన్నికైన కొత్తల్లో రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట అన్నారు. భారీ మెజారిటీలు వచ్చిన ప్రభుత్వాలు ఎపుడూ ప్రమాదమే అని, ఇపుడు జగన్ సర్కార్ ని చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఇక్కడ మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్ పేయిలను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. వారి అపారమైన అనుభవంతో మైనారిటీ, సంకీర్ణ ప్రభుత్వాలను కూడా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. మరి దీన్ని చూసి అయినా జగన్ ఏమైనా నేర్చుకుంటారా.

Related Posts