YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

పీక్స్ కు శివ‌సేన బీజేపీ మ‌ధ్య మంట‌లు

పీక్స్ కు శివ‌సేన బీజేపీ మ‌ధ్య మంట‌లు

మహారాష్ట్ర స‌ర్కార్.. సెంట్ర‌ల్ స‌ర్కార్ లు నువ్వా నేనా అంటున్నాయి. శివ‌సేన బీజేపీ మ‌ధ్య మంట‌లు పీక్స్ కి వెళ్లాయి. ఎవ‌రూ తగ్గ‌డం లేదు. ఇప్పుడు రిప‌బ్లిక్ టీవీ చీఫ్ అర్న‌బ్ గోస్వామి అరెస్ట్ తో ర‌చ్చ ఇంకాస్త పెరిగింది. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స‌పోర్ట్ ఉండ‌డంతో.. అర్న‌బ్ రెచ్చిపోతున్నాడ‌ని.. సందు చూసి.. సంచిలో వేసింది మ‌హారాష్ట్ర స‌ర్కార్. అంద‌రి ముందే.. గ‌ల్లా ప‌ట్టి లాక్కెళ్లింది. అంత పెద్ద జ‌ర్న‌లిస్ట్ గా పేరున్న అర్న‌బ్ ని కావాల‌నే అలా చేసింది అనేది బీజేపీ ఇంటెన్ష‌న్. స‌రిగ్గా చేశార్రా బాబూ అనేది శివ‌సేన ఇంటెన్ష‌న్. అంద‌రి ముందే అరెస్ట్ చేసి.. పోలీస్ జీప్ లో లాక్కెళ్ల‌డం.. అర్న‌బ్ ర‌చ్చ చేస్తుంటే గుంజి గుంజి తీస్కెళ్ల‌డం ఇంట్ర‌స్టింగ్ గా మారింది. అందుకే.. సెంట్ర‌ల్ లీడ‌ర్లంతా లైన్ లోకి వ‌చ్చారు. అమిత్ షా ద‌గ‌ర్నుంచి ప్ర‌సార శాఖా మంత్రి దాకా అంద‌రూ క‌దిలారు. ఇది జ‌ర్న‌లిస్టులపై దాడి అంటున్నారు. అఫ్ కోర్స్ ఆ మాట అంద‌రూ అనేదే కానీ.. ఇక్క‌డ జ‌ర్న‌లిజ‌మా.. పార్టీల పోట్లాట అనేది ఇండైరెక్ట్ పాయింట్. ఇండైరెక్ట్ ఏంది చెప్పండి.. ఇది డైరెక్ట్ వారే. మొన్నా మ‌ద్య కంగనా ఎవ్వారం కూడా అంతే క‌దా. ఆఫీస్ నే కూల్చింది ముంబై స‌ర్కార్.. ఆమెకు సెంట్ర‌ల్ స‌ర్కారేమో.. ఫుల్లు సెక్యూరిటీ ఇచ్చింది. రెండు ప్ర‌భుత్వాలు ఎవ‌రి కెపాసిటీ వాళ్లు చూపిస్తున్నారు. మ‌హారాష్ట్ర స‌ర్కార్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. మా శివ‌సైనికులు బ‌రిలోకి దిగితే మామూలుగా ఉండ‌దు అంటున్నారు. సుశాంత్ సింగ్ సూసైడ్ కేస్ లో.. మహారాష్ట్ర సీఎం కుమారుడు ఉన్నాడు అన్న ద‌గ్గ‌ర్నుంచి ఈ ఇష్యూ పీక్స్ కి వెళ్లింది. సుశాంత్ సింగ్ లో ఉద్ధ‌వ్ ఠాక్రే కుమారుడ్ని ఇరికించ‌డం.. దాన్ని హైలైట్ చేయ‌డం ఇలాంటివ‌న్నీ బీజేపీ చేస్తుంది అనేది వీళ్ల ఇంటెన్ష‌న్.. రిప‌బ్లిక్ టీవీ దీన్ని ఇంకాస్త హైలైట్ చేస్తూ.. మ‌హారాష్ట్ర స‌ర్కార్ కి ఎగైనెస్ట్ గా వెళ్తున్నారు. రిప‌బ్లిక్ టీవీ అమిత్ షాది కావ‌డం వ‌ల్లే.. అర్న‌బ్ అలా అరుస్తున్నాడ‌ని వాళ్ల ఇంటెన్ష‌న్. కంగనా కూడా సుశాంత్ సింగ్ కేస్ పై ఇష్యూ చేయ‌డం వ‌ల్లే.. ఆ మ‌ధ్య అంత ర‌చ్చ జ‌రిగింది. ఇప్పుడు పార్టీలు పార్టీలు క‌లిసి.. వీళ్ల‌ని పావులుగా వాడుకుంటూ పీక్స్ కి తీసుకెళ్తున్నాయి. అందుకే.. పొలిటిక‌ల్ హీట్ అంత‌లా పెరిగింది.

Related Posts