YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మెట్ల మార్గం పున: ప్రారంభం

మెట్ల మార్గం పున: ప్రారంభం

కరోనా, లాక్ డౌన్ కారణంగా మార్చిలో మూతబడిన తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గాన్ని టీటీడీ తిరిగి తెరిచింది. మార్చి 20న మూతపడిన మార్గాన్ని నేటి నుంచి తిరిగి తెరుస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే భక్తులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తిరుమల శ్రీ భూవరాహస్వామి ఆలయ విమానం గోపురానికి 14 కోట్ల రూపాయల వ్యయంతో బంగారు తాపడం చేయించనుంది. బంగారు తాపడం కోసం 42.4 కేజీల బంగారాన్ని1800 కేజీల రాగిని  టీటీడీ వినియోగించనుంది. ఈ మరమ్మత్తుల కోసం మరోసారి శ్రీ భూవరాహస్వామి ఆలయానికి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. డిసెంబరు 6వ తేదీ నుండి 10 వరకూ నిర్వహించాలని అగమ సలహా మండలి నిర్ణయం తీసుకుంది.దేవ‌తామూర్తులలో శ‌క్తిని బింబం( అత్తి విగ్రహం)లోకి ఆవాహ‌న చెయ్యనున్నారు అర్చకులు. 6 నెలల పాటు అత్తి విగ్రహంలోనే వరాహస్వామికీ నిత్య కైంకర్యాలను నిర్వహించనున్నారు అర్చకులు. కరోనా నేపథ్యంలో మార్చి 20వ తేదీ నుంచి టీటీడీ దర్శనాన్ని నిలిపివేయగా మరో 6 నెలల పాటు వరాహస్వామి దర్శనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక అని అంటోంది టీటీడీ. 2021 సంవత్సరానికి సంబంధించి ముద్రించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ.. తమ అఫీషియల్ వెబ్‌సైట్‌  తో పాటు ఆన్‌లైన్‌లోనూ భక్తులకు అందుబాటులో ఉంచింది. అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌ ద్వారా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకున్నవారికి ప్యాకేజింగ్, షిప్పింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది.
టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న విదేశాల్లోని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా డెలివరీ చేసే ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇక డైరీలు, క్యాలెండర్లు కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 0877-2264209, 9963955585 నెంబర్లను సంప్రదించాలని టీటీడీ సూచించింది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, న్యూఢిల్లి, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాలతో పాటు టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాల్లోనూ క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉంచింది.

Related Posts