YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కరోనా బారిన స్టూడెంట్స్

ఏపీలో కరోనా బారిన స్టూడెంట్స్

ఏపీలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరవుతున్నారు.. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు వస్తున్నారు.. స్కూళ్లలో జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది. జిల్లాల్లో టీచర్లు, విద్యార్థులకు వైరస్ నిర్థారణైనట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలోని స్కూళ్లల్లో ఏడుగురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు, ఓ హెచ్ఎంకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాగులుప్పలపాడు మండలం కనపర్తి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎంతో పాటు మరో విద్యార్థి కొవిడ్ సోకింది. కంభం మండలం పెద్ద నల్లకాల్వలో ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఇంకొల్లు మండలం గంగవరంలో ఇద్దరు టీచర్లు.. కనిగిరి మండలం దిరిశవంచలో ఇద్దరు, పీసీ పల్లిలో ఒకరు, బేస్తవారపేట మండలం గలిజేరుగుళ్లలో ఓ విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది.గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ఎడవల్లిలో 8 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. విద్యార్థులను హోం ఐసోలేషన్ లో ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. చిత్తూరులో కరోనా కేసులు ఎక్కువైయ్యాయి. స్కూల్స్ తెరిచిన మూడు రోజుల్లోనే ఆ జిల్లాలో సుమారు 150 మంది టీచర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. అంతేకాదు 9 మంది విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.మరోవైపు కరోనా కేసులు బయటపడుతుండటంపై మంత్రి సురేష్ స్పందించారు. గతంలోనే వారికి సోకి తెలుసుకోకపోవటం, పాఠశాలల్లో పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతున్నాయని.. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్ట్‌లు చేస్తున్నారన్నారు. కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. స్కూళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము అన్నారు.

Related Posts