YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వింతలు దేశీయం

ఒడిశా అడవుల్లో ప్రత్యక్ష్యంఅయిన ‘బ్లాక్ టైగర్’

ఒడిశా అడవుల్లో ప్రత్యక్ష్యంఅయిన ‘బ్లాక్ టైగర్’

బ్లాక్ టైగర్’ దీని గురించి ఎప్పుడు అనుకునేదే..కానీ కనిపించే రకం కాదు.  ఇంతవరకు మనదేశంలో బ్లాక్ టైగర్ లు అసలు ఉన్నాయా లేదా అనేది సరిగా నిర్ధారించిన వారు లేరు. కానీ ఇటీవల ఓ వ్యక్తి బ్లాక్ టైగర్ ను చూశాడు. చూడటమే కాదు దాన్ని తన కెమెరా లో బంధించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది.  నిజానికి మనదేశం లో పులులు ఆరెంజ్ కలర్లో ఉంటాయి. వాటి శరీరంపై నలుపురంగులో చారలు ఉంటాయి. ఒడిశా అడవుల్లో కనిపించిన పులి మాత్రం నలుపురంగులో ఉన్నది. దాని శరీరంపై ఉన్న చారలు మాత్రం ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఈ రంగు పులిని ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఈ వింత పులి ప్రత్యక్షమైంది. ఇటువంటి పులులను ‘మెలనిస్టిక్ టైగర్’గా పిలుస్తారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే సాధారణంగా ఈపులులు మనదేశంలో ఉండవు.. కానీ జన్యుపరమైన లోపాల వల్ల ఇటువంటి పులులు జన్మించి ఉండవచ్చని అధికారులు చెబతున్నారు. ఈ పులులు కూడా ఇండియాలో ఎక్కువగా కనిపించే బెంగాల్ టైగర్ జాతికి చెందినవేనని అధికారులు చెబుతున్నారు.  ఈ పులిని తన కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్ సౌమేన్ బాజ్పేయ్ ఏమంటున్నారంటే.. ‘నేను అడవిలో వివిధ రకాల పక్షులు జంతువులను ఫొటోలు తీస్తుంటాను. ఇటీవల సిమ్లీపాల్ అడవికి వెళ్లినప్పు డు అక్కడ నాకు ఈ పులి కనిపించింది. దాన్ని చూసిన వెంటనే నేను షాక్ కు గురయ్యాను. నేను ఫారెస్ట్ లో తిరిగేటప్పుడు చాలా రకాల పులులు క్రూర జంతువులు నా కంట పడతాయి. కానీ ఈ పులి నల్లగా ఉంది. దాన్ని చూడగానే నాలో ఆందోళన మొదలైంది. అయినా వెంటనే దాని ఫొటోను తీసుకున్నాను. అది ఓ చెట్టు చాటు నుంచి నన్ను గమనించింది. కొద్ది సేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది అరుదైన పులి అని అటవీశాఖ అధికారుల ద్వారా తెలుసుకున్నాను’ అని వాజపేయి చెప్పారు. ప్రస్తుతం వాజపేయి తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేసిన నల్ల పులి ఫొటో పోస్టు తెగ వైరల్ అవుతోంది

Related Posts