YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

పీలో కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం

పీలో కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం

ఏపీలో కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఇసుక పాలసీపై గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ సిఫారసులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని ఇసుక రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సిఫారసులు చేసింది. దీనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ సర్కార్ వచ్చాక ప్రకృతి సంపద అయిన ఇసుక తరలింపుపై నిషేధం విధించి కఠిన నిబంధనలు పొందుపరిచింది. అయితే ఇసుక కొరత వర్షాలకు ఇబ్బందులు ఏర్పడడంతో ఏపీలో భవన నిర్మాణం ఆగిపోయింది.నిర్మాణ రంగం కుదేలైందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే టీడీపీ నేతల ఇసుక దోపిడీకి చెక్ పెట్టడానికే ఇలా చేశామని అధికార వైసీపీ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది.అన్ని ఇసుక రీచులను ఒకేసంస్థకు అప్పగించాలన్న  సబ్ కమిటీ సిఫారసులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక రీచులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు ముందుకు రాకపోవడంతో పేరొందిన సంస్థలకు ఇసుక రీచులను అప్పగించాలని నిర్ణయించారు.  ఓపెన్ టెండర్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు.ఇసుక తవ్వకాలు సరఫరాను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.వరదలు భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై రూపొందిన అంచనాలను కేబినెట్ లో చర్చించారు. సుమారు 10వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనావేసింది. కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

Related Posts