విశాఖ ఏజెన్సీ ప్రాంతం పాడేరు పి.ఎం.ఆర్.సి భవనంలో అధికార పార్టీ నాయకులు చాలా ఆడంబరంగా ఆధార్ కేంద్రం ప్రారంభించారు.
ప్రారంభించి నేటికి నెల రోజులు గడుస్తున్నా.
ఆధార్ కేంద్రం
తలుపులు తెరవకపోవడం అధికారులు గమనించాలి.
ఆధార్ కేంద్రం దగ్గర గిరిజన ప్రజలు చాలా దూరం నుండి వచ్చి పడికాపులు కాస్తున్న కనీసం అక్కడ ఎవరు సమాధానం చెప్పడానికి
కూడా లేని పరిస్థితి. ఆదివాసులు రోజు రోజు చెప్పులరిగేలా తిరుగుతున్న వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒకవైపు ఆడంబరాలతో ప్రారంభం జరిగిందితప్ప ఆచరణలో మాత్రం
కనిపించడం లేదు, ప్రతిరోజు 30,40 కిలో మీటర్ల దూరం నుండి ఆధార్ కేంద్రానికి వస్తున్న ఆదివాసులు పనులు మానుకొని, చిన్న పిల్లలతో చంకన వేసుకొని వస్తే ఇక్కడ ఆధార్ కేంద్రం
తలపులు మూయబడి ఉంటుంది మళ్ళీ నిరాశతో వెనుకకు వెళ్లి పోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పట్టించుకొని ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందించాలని సిపిఐ
పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ. పాడేరు మండలం నాయకులు గండేరు జీవన్. అమర్ తదితరులు పాల్గొన్నారు.