పత్రికలు సమాజాన్ని నిర్దేశిస్తాయని ప్రముఖ సంఘ సేవకులు కోటా సునీల్ కుమార్ స్వామి పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో పంచమవేదం జాతీయ ఆంగ్ల తెలుగు పత్రిక ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఇలాంటి పత్రిక అవసరమన్నారు . సనాతన భారతీయ సంస్కృతి, నాగరికతను నేటి తరానికి అందించడమే లక్ష్యంగా పంచమవేదం ముందడుగు వేయాలని ఇచ్చారు. మహాభారతంలోని ఉన్నత సందేశాన్ని పంచమ వేదం ద్వారా యువతకు దగ్గరి చేయాలని కోరారు. వాట్సాప్ లోకి పరిమితమైన నేటి తరుణంలో పంచమ వేదం, నేటి పరిస్థితులను యువతకు అర్థం కట్టినట్లు చెప్పగలిగే తీరులో వార్తా పరిజ్ఞానం అందించాల్సి ఉంది అన్నారు. ఉన్నత భావాలు నైతిక విలువలతో పత్రికను నిర్వహించడం జరుగుతుందని పత్రిక నిర్వాహకులు మహేష్ ఆనందస్వామి పేర్కొన్నారు .ఈ సందర్బంగా ఏపీయూడబ్లూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ మాట్లాడుతూ విలువలతో కూడిన ఈ వార్తా సేకరణ తో పాటు ఆత్మీయ బంధం, ఆధ్యాత్మిక బంధం ప్రజల్లో కొనసాగే విధంగా , పంచమవేదం మాసపత్రిక విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విహెచ్ పీ నేత వెంకటేశ్వర్లు, దయానంద సరస్వతి, శ్రీనివాస రావు, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రికలు సమాజాన్ని నిర్దేశిస్తాయని ప్రముఖ సంఘ సేవకులు కోటా సునీల్ కుమార్ స్వామి పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో పంచమవేదం జాతీయ ఆంగ్ల తెలుగు పత్రిక ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఇలాంటి పత్రిక అవసరమన్నారు . సనాతన భారతీయ సంస్కృతి, నాగరికతను నేటి తరానికి అందించడమే లక్ష్యంగా పంచమవేదం ముందడుగు వేయాలని ఇచ్చారు. మహాభారతంలోని ఉన్నత సందేశాన్ని పంచమ వేదం ద్వారా యువతకు దగ్గరి చేయాలని కోరారు. వాట్సాప్ లోకి పరిమితమైన నేటి తరుణంలో పంచమ వేదం, నేటి పరిస్థితులను యువతకు అర్థం కట్టినట్లు చెప్పగలిగే తీరులో వార్తా పరిజ్ఞానం అందించాల్సి ఉంది అన్నారు. ఉన్నత భావాలు నైతిక విలువలతో పత్రికను నిర్వహించడం జరుగుతుందని పత్రిక నిర్వాహకులు మహేష్ ఆనందస్వామి పేర్కొన్నారు .ఈ సందర్బంగా ఏపీయూడబ్లూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ మాట్లాడుతూ విలువలతో కూడిన ఈ వార్తా సేకరణ తో పాటు ఆత్మీయ బంధం, ఆధ్యాత్మిక బంధం ప్రజల్లో కొనసాగే విధంగా , పంచమవేదం మాసపత్రిక విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విహెచ్ పీ నేత వెంకటేశ్వర్లు, దయానంద సరస్వతి, శ్రీనివాస రావు, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.