YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

వ్యవసాయ బిల్లును రద్దు చేయాలి

వ్యవసాయ బిల్లును రద్దు చేయాలి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాకూర్ హజరయ్యారు.  ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రెటరీ  శ్రీనివాస్ గౌడ్, ,పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చేవెళ్ళ నియోజకవర్గ ఇంచార్జ్ సున్నపు వసంతం ,తమ్మలి మణయ్య, షాబాద్ దర్శన్ చేవెళ్ళ శైలాజసర్పంచ్ ఆగిరెడ్డి పాల్గోన్నారు.  మాణికం ఠాగూర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేవెళ్లలో సంతకాల సేకరణ చేపట్టారు. హస్తం గుర్తు ఎల్లవేళలారైతులకు అండగా ఉంటుందని రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని భరోసా ఇచ్చారు. అందరూ కలిసి కట్టుగా పోరాడి కేంద్రం మెడలు వంచి బిల్లులను రద్దు చేయించే వరకు పోరాడలన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసారని కుటుంబ పాలనగా మారిందని అన్నారు. కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.. కేసీఆర్అంటే కొడుకు కూతురు అల్లుడుగా మారిందని అన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండి కేసీఆర్ అవినీతి పాలనపై ప్రశ్నించటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే కేసీఆర్ అవినీతి పై విచారణ జరిపి అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల అధ్యక్షులు సంతకాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు

Related Posts