YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీకి వ్యతిరేకంగా 250 రైతు సంఘాలు

మోడీకి వ్యతిరేకంగా 250 రైతు సంఘాలు

ఉత్తర భారతంలో మోదీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూరేలే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకు అకౌంట్ లోకి సొమ్ములు ఒక పక్క చేస్తూ మరో వైపు కొత్త వ్యవసాయ చట్టాలను
తెచ్చి రైతుల పొట్ట కొడుతున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే రైతులు సంఘటిత
మవుతున్నారు.ప్రధానంగా ఉత్తర భారతంలో రైతులు మోదీపై మండి పడుతున్నారు. పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలతో పాటు దక్షిణాది కర్ణాటకలో కూడా పెద్దయెత్తున ఆందోళన జరుగుతుంది. పంజాబ్ లో
అయితే రైతులు పెద్దయెత్తున ముందుకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. అందుకే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ సయితం రైతుల ఆగ్రహాన్ని చూసి బయటకు వచ్చింది. మంత్రివర్గం
నుంచి తప్పుకుందంటే రైతుల సెగ ఎలా ఉందో? ఇట్టే అర్థం చేసుకోవచ్చు.వ్యవసాయంలో తీసుకొచ్చిన కొత్త చట్టాల కారణంగా రైతులు మరింత నష్టపోతారని, కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిర్ణయం
తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ రోజూ అనేక రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకల్లో కూడా రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.దేశ వ్యాప్తంగా 250 రైతు సంఘాలు సమావేశమై భవిష్యత్ కార్యాచారణను ప్రకటించనున్నాయి. ఈనెల 7వ తేదీన ఇప్పటికే రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. నూతన వ్యవసాయ
చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. రైతు ప్రయోజనాలకు భంగం కల్గించే విగా ఉన్న ఈ చట్టాలను వెనక్కు తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. అందుకే ఐదో తేదీన భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు
పేర్కొన్నాయి.

Related Posts