YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*తిరుమల సమాచారం

 *తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రొజు మంగళవారం, 23.01.2018

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి 5 గంటలు, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. కాగా ఇవాళ సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.

సోమవారం నాడు 71,951 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలిగింది. 26,731 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. సోమవారం స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్ల నగదును భక్తులు సమర్పించినట్లుగా తెలుస్తోంది.

   ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 71,951 మంది
   భక్తులకు స్వామివారి దర్శన
   భాగ్యం కలిగినది.

•  స్వామి దర్శనం కోసం
   వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో
   13 కంపార్ట్ మెంట్స్ లలో
   భక్తులు స్వావారి
   దర్శనం కోసం వేచి ఉన్నారు.

• సర్వదర్శనానికి 05 గంటల
   సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.40 కోట్లు.

• నిన్న 26,731 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.

•  రేపు సూర్యజయంతి
   సందర్భంగా శ్రీమలయప్ప
   స్వామివారు ఉ: 5.30 - రా:9
   వరకు సప్తవాహనాలపై
   భక్తులకు దర్శనమిస్తారు.
   మ: 2 గంటలలకి చక్రస్నానం
   నిర్వహిస్తారు.

• జనవరి 29న వృద్ధులు,
  దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక
  దర్శనం.

• జనవరి 30 న చంటిపిల్లల
   (5ఏళ్ళు) తల్లిదండ్రులకు
   ఉచిత ప్రత్యేక దర్శనం.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

ttd toll free#
18004254141
ttd whatsapp#
+919399399399

Related Posts