YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రవాణా వ్యవస్థ మరింత పటిష్టం : మంత్రి మహేందర్ రెడ్డి

రవాణా వ్యవస్థ మరింత పటిష్టం : మంత్రి మహేందర్ రెడ్డి

రాష్ట్రం లో ప్రజా రవాణా వ్యవస్థ లు మరింత బలోపేతం చేసేందుకు ఆర్టీసీ కి ప్రాధాన్యం ఇస్తాం. బడ్జెట్ లో సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయించారు. రాష్ట్రం లోని 97 డిపోల పరిధిలో 1400 డీఓటీ దుకాణాలు ఏర్పాటు చేసి రూ. 40 కోట్ల ఆదాయం పెంచుతున్నమని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు తాండూరు బస్ స్టాండ్ లో రూ. 43 లక్షలతో 29 డీఓటీ దుకాణం సముదాయం పనులకు మంత్రి శ్రీ కారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, జిల్లా కలెక్టర్ ఓమర్ జలీల్, ఆర్టీసీ ఈడీ కొమరయ్య ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.  మంత్రి మాట్లాడుతూ పెట్రోల్ పంపులు, సినిమా హాళ్ళు,  దుకాణం సముదాయాలు ఏర్పాటు చేసి ఆర్టీసీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నమన్నారు. ఆర్టీసీ కోసం 1400 కొత్త బస్సులు కొనుగోలు చేసి పల్లె వెలుగుకు ప్రాధాన్యం ఇస్తూ దూర ప్రాంతాలకు సేవలు పెంచుతున్నం. 230 వజ్రా సర్వీసులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.  రూ. 60 కోట్ల నిధులతో ఆర్టీసీ బస్ స్టాండ్ లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ ని లాభాల్లో నడిపిస్తామని మంత్రి అన్నారు. 

Related Posts