YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

మళ్లీ ఒంటరిపోరంటున్న దేవగౌడ

మళ్లీ ఒంటరిపోరంటున్న దేవగౌడ

దేవెగౌడ ను మెచ్చుకోకుండా ఉండలేం. వయసు మీద పడుతున్నా ఆయన లోని పొలిటికల్ పవర్ తగ్గలేదంటారు ప్రత్యర్థులు కూడా. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి ఉపయోగపడేదిగానే ఉంటుందంటారు. అందుకే జనతాదళ్ ఎస్ ఇప్పటికీ కర్ణాటకలో జాతీయ పార్టీలతో పోటీ పడుతూ నెగ్గుకువస్తుంది. దేవెగౌడ పార్టీ పెట్టిన నాడు అందరూ ఎద్దేవా చేశారు. ఇది కుటుంబ పార్టీగా మిగిలిపోతుందని విమర్శలు చేసిన వారు లేకపోలేదు.ప్రాంతీయ పార్టీ పెట్టి ఏకంగా ప్రధాని అయిన చరిత్ర కూడా దేవెగౌడది. అయితే ఆయన రాజీకీయంగా వేసిన అంచనాలు ఎప్పటికప్పుడు కరెక్టు అవుతుండటమే పార్టీ నేతల్లో ధైర్యానికి కారణం. 90వ వడిలో పడినా నిర్ణయాల్లో మాత్రం దేవెగౌడ తొందరపడరంటారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కింగ్ మేకర్ గా మారి చివరకు కుమారుడిని దేవెగౌడ ముఖ్యమంత్రిగా చేయగలిగారు.జనతాదళ్ ఎస్ ను స్థాపించిన తర్వాత మూడు సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా దేవెగౌడదే. దేవెగౌడ తన పార్టీని కుటుంబ పార్టీ అని విమర్శలు విన్పిస్తున్నా ఆయన పెద్దగా పట్టించుకోరు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి నడిచారు. రాజ్యసభ ఎన్నికల వరకూ కలసే ఉన్న దేవెగౌడ ఆ పదవి దక్కగానే ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీని ఆదేశించారు. కర్ణాటక లో జరుగుతున్న రాజేశ్వరినగర్, శిర నియోజకవర్గాల్లో జేడీఎస్ విడిగా పోటీ చేస్తుంది.ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి మరోసారి రావాలన్నది దేవెగౌడ ఆలోచనగా ఉంది. అందుకే ఉప ఎన్నికలను ట్రయల్ రన్ గా ఉపయోగించు కుంటు న్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా జనతాదళ్ ఎస్ పోటీ చేస్తుందని దేవెగౌడ కుండబద్దలు కొట్టారు. ఎవరైనా తన వద్దకు రావాలనుకునే మనస్తత్వం దేవెగౌడది. అందుకే వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు ఎవరు ముందుకు వచ్చినా అధికారం తమకే దక్కుతుందన్న విశ్వాసంతో ఉన్నారు పెద్దాయన. క్యాడర్ లో ఎటువంటి గందరగోళం లేకుండా తాము వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

Related Posts